Share News

అసైన్ట్‌ భూముల అక్రమ పట్టా

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:24 PM

అసైన్ట్‌ భూములను ఇతరుల పేరుపై అక్రమంగా పట్టా చేశారని న్యాయవాదులు గాలి వినోద్‌కుమార్‌, సంఘం దానక్క, గోవింద్‌ సురేశ్‌బాబు ఆరోపించారు.

అసైన్ట్‌ భూముల అక్రమ పట్టా
బాధితులతో మాట్లాడుతున్న న్యాయవాదులు

- 50 మంది ఎస్సీ కుటుంబాలకు చెందిన 45 ఎకరాల అసైన్డ్‌ భూమి

జడ్చర్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : అసైన్ట్‌ భూములను ఇతరుల పేరుపై అక్రమంగా పట్టా చేశారని న్యాయవాదులు గాలి వినోద్‌కుమార్‌, సంఘం దానక్క, గోవింద్‌ సురేశ్‌బాబు ఆరోపించారు. మండలంలోని బురెడ్డిపల్లి శివారులోని సర్వే నెంబరు 102/1లో 15 ఎకరాలు, సర్వే నెంబరు 102/2లో 15 ఎకరాలు, సర్వే నెంబరు 120/3లో 15 ఎకరాల భూమి 50 ఎస్సీ కుటుంబాలకు చెందినవని వివరించారు. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి శివారులోని ఎస్సీలకు చెందిన అసైన్డ్‌ భూముల వద్ద ఆదివారం బాధితులను కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీలకు చెందిన భూములను ఆదిత్య హెల్త్‌కేర్‌ స్పెషలైజేషన్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ రిప్రజెంటేటివ్‌ వంగా ఆశీష్‌రెడ్డి, కొలాన్‌ డెవలపర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొలాన్‌ సురేందర్‌రెడ్డి, ఎం.రవికుమార్‌, దశరథ్‌గుప్తతో పాటు ఇతరుల పేరుపై మార్చారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుని అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ఎస్సీ కుటుంబాలకు స్వాధీనం చేయాలని కోరారు. గుండు కృష్ణయ్య, గుండు రొడ్డసత్తయ్య, గుండు రంగయ్యకు చెందిన తాత మాదిగ నాగయ్య కుటుంబానికి గతంలో 45 ఎకరాల భూమిని అసైన్డ్‌ చేశారని వివరించారు. వ్యాపారస్థులు, సంస్థలు, కొందరు వ్యక్తులు చట్ట విరుద్ధంగా రెవెన్యూ అధికారుల అండతో పూర్వీకుల పేర్లను తొలగించి అక్రమంగా వారి పేర్లమీదకు మార్చుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్స్‌ వేయడం జరిగిందని, స్టేటస్‌కో ఉత్తర్వులను జారీ చేసిందని వివరించారు. హైకోర్టు ఉత్తర్వులను జిల్లా అధికారులు, మండల అధికారులు అమలు చేయాలని కోరారు.

Updated Date - Nov 15 , 2026 | 11:24 PM