Share News

చేతకాకపోతే జీవో ఇవ్వండి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:38 PM

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథ కంలో భాగంగా చేపట్టిన నా ర్లాపూర్‌ రిజర్వాయర్‌ నుం చి నీటిని ఎలాతీసుకు వెళ్లా లో బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌ ను మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్వీకరించారు.

చేతకాకపోతే జీవో ఇవ్వండి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మెయిన్‌ కెనాల్‌లో నిలిచిన పనులను చూపుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మేమే దగ్గరుండి నార్లాపూర్‌ నీళ్లు తెచ్చి చూపిస్తాం : మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

కొల్లాపూర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) :పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథ కంలో భాగంగా చేపట్టిన నా ర్లాపూర్‌ రిజర్వాయర్‌ నుం చి నీటిని ఎలాతీసుకు వెళ్లా లో బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌ ను మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్వీకరించారు. గురువా రం ఆయన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలి సి నార్లాపూర్‌ రిజర్వాయర్‌కు కుడికిళ్ల వద్ద అ డ్డంగా ఉన్న రాక్‌ స్టోన్‌ కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డారు. నార్లాపూర్‌ వద్ద ప్రస్తుతం రెండు పంపు లు మాత్రమే నడుస్తున్నాయి. కుడికిళ్ల దగ్గర ఉన్న తుండుకట్టలో పావు భాగం మట్టిని లేదా నిర్దేశిత అడ్డంకులను తొలగిస్తే గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీళ్లు తర లించవచ్చని తెలిపారు. మీకు చేయడానికి చేత కాకపోతే ప్రభుత్వపరంగా జీవో ఇచ్చి నామి నేసన్‌ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వండి తామే దగ్గ రుండి కట్ట తొలగించి, నీళ్లు తెచ్చి రిజర్వాయర్లు నింపి చూపుతామని ఆయన అన్నారు. రాష్ట్రం లో కరెంటు లేదంటూ ఎల్‌నినో సాకు చెప్పడం అధికార పార్టీకి అలవాటైపోయిందన్నారు. వెట కారపు మాటలు కట్టిపెట్టి, ఇప్పటికైనా రైతాంగా నికి సాగునీరు ఎలా అందించాలనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, నిరంజన్‌ గౌడ్‌, జంబులయ్య ఉన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:38 PM