వనరులను గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:09 PM
గ్రామానికి అవసరమైన వనరులను గుర్తించి, భ విష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామానికి అవసరమైన వనరులను గుర్తించి, భ విష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో గద్వాల నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శు లు, ఇతర అధికారులకు వికసిత్ గ్రామ పంచా యతీ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లోని వన రులు, వాటి వివరాలను మ్యాపులద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు తదితర అం శాలపై శిక్షకులు అవగాహన కల్పించారు. చెక్ డ్యామ్‌లు, ఫామ్‌పాండ్లు, ఇంకుడు గుంతలు వంటి నిర్మాణాల ద్వారా నీటి సంరక్షణ చేపట్టే విధానాలను మ్యాపుల సహాయంతో వివరించారు. గ్రామాల్లో ఉన్న సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులు, నీటి వన రులను సమగ్రంగా గుర్తించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఈ వనరుల ఆధారంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భజలాలను పెం పొందించడం, నీటి వనరులను సంరక్షించ డం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల న్నారు. గ్రామ పంచాయతీ ప్రణాళికలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థా యిలో ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా గ్రామాల అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ డీవో ముషాహిదాబేగం, డీపీవో శ్రీకాంత్, అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు.