Share News

హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తా

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:22 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తుంటూనే ఉంటామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తా

  • తనకు ప్రాణహాని జరిగితే రేవంత్‌రెడ్డిదే బాధ్యత

  • బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

గద్వాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తుంటూనే ఉంటామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేసిన పనులేనని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్డెడు మట్టిని తీయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి గద్వాల పర్యటనలో భాగంగా పెండింగ్‌ ప్రాజెక్టుల పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గద్వాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టులు ఏ ళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయ ని, వాటి పూర్తికోసం ప్రభు త్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ గురుకుల పాఠశాలలో జరుగుతున్న కుం భకోణాలపై బీఆర్‌ఎస్‌ రాజీలేని పోరాటం చేస్తుందన్నా రు. తాను రాజకీయాల కోసం వచ్చిన వక్తిని కాదని 26ఏళ్లు ఐపీఎస్‌ అధికారిగా దేశంకోసం పనిచేశానని గుర్తుచేశారు. గతంలో తనకు ఏ ప్రభుత్వం కూడా భద్రతను తగ్గించలేదని, సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా భద్రతను తగ్గించారని మండిపడ్డారు. తన ప్రాణాలకు రేవంత్‌రెడ్డిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. సమావేశంలో ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రాజీవ్‌సాగర్‌, నాయకులు బాసు హనుమంతునాయుడు, వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 11:22 PM