ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:25 PM
ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ గ్రామంగా చిట్టబోయిన్‌పల్లిని తీర్చిదిద్దుతానని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ సీనియర్ శాస్త్రవేత్త రమేశ్‌నాయక్ పేర్కొన్నారు.
- జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ శాస్త్రవేత్త రమేశ్‌నాయక్
జడ్చర్ల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ గ్రామంగా చిట్టబోయిన్‌పల్లిని తీర్చిదిద్దుతానని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ సీనియర్ శాస్త్రవేత్త రమేశ్‌నాయక్ పేర్కొన్నారు. మండలంలోని చిట్టబోయిన్‌పల్లి తండాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాల కింద మహబూబ్‌నగర్ జిల్లాలో చిట్టబోయిన్‌పల్లి గ్రామాన్ని, వికారాబాద్ జిల్లాలోని అడవి వెంకటాపురం గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించామని, అందులో భాగంగానే చిట్టబోయిన్‌పల్లి తండాలో 90 కుటుంబాలను ఎంపిక చేసిన నానో యూరియా, టార్పాలిన్ కవర్లను పంపిణీ చేశామన్నారు. రానున్న రబీ సీజన్‌లో హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను అందజేస్తామని తెలిపారు. కూరగాయలు, మొక్కజొన్న, వరి పంటలను సేంద్రీయ పద్దతుల్లో సాగు చేసేలా ప్రోత్సాహిస్తామన్నారు. ఈ కార్యక్రమం మరో రెండేళ్లు కొనసాగించనున్నట్లు తెలిపారు. చిట్టబోయిన్‌పల్లి సర్పంచ్ గోప్యానాయక్, డాక్టర్ రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ రంజిత్, డాక్టర్ రేష్మ, డాక్టర్ మురళి, గ్రామస్థులు శ్రీనివాస్‌రెడ్డి, చందు, శంకర్‌నాయక్, సూర్యం, కృష్ణనాయక్, తులసీరామ్, గోపాల్, సుమన్ పాల్గొన్నారు.