Share News

రెండేళ్ల సేవలు ఎప్పటికీ మరిచిపోలేను

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:45 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలోనే కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ కావడం ఎంతో ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

రెండేళ్ల సేవలు ఎప్పటికీ మరిచిపోలేను
కలెక్టర్‌కు కేక్‌ను తినిపిస్తున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

  • జోగుళాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌

  • అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ముందుకు

  • కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది

గద్వాల న్యూటౌన్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోనే కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ కావడం ఎంతో ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. రెం డేళ్లపాటు సేవలందించిన కలెక్టర్‌ బీఎం సంతోష్‌ను అధికారులు, తహసీల్దార్లు సోమవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్‌హాలులో ఘనంగా సన్మానించారు. జిల్లాలో కలెక్టర్‌గా రెండేళ్లపాటు సేవలందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జిల్లాలో పనిచేస్తూ అనేక విషయాలు నేర్చుకున్నానని, మొదటి సంవత్సరంలో కొన్ని ఇబ్బం దులు ఎదురైనప్పటికీ, అధికారుల సహకారం, సమన్వయంతో వాటిని అధిగమించానని అన్నా రు. మంచి టీమ్‌ ఉన్నందునే జిల్లాలో కలెక్టర్‌గా విజయవంతంగా పనిచేయడం సాధ్య మైందన్నారు. సహకరించిన ప్రతీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు ఉన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 11:45 PM