Share News

భార్యలకు బదులు భర్తలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:24 PM

మండల సమా వేశానికి మహిళా సర్పంచులకు బదులుగా వారి భర్త లు హాజరయ్యారు. అందుకు ఇతర సర్పంచులు అభ్యం తరం తెలిపారు. వారిని బయటకు పంపించాలని డి మాండ్‌ చేశారు.

భార్యలకు బదులు భర్తలు
వాగ్వాదానికి దిగిన సర్పంచులు, మహిళా సర్పంచుల భర్తలు

- వెల్దండ మండల సమావేశానికి హాజరైన పతులు

- బయటకు పంపించాలని సభ్యుల డిమాండ్‌

- ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో రసాభాస

వెల్దండ, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : మండల సమావేశానికి మహిళా సర్పంచులకు బదులుగా వారి భర్త లు హాజరయ్యారు. అందుకు ఇతర సర్పంచులు అభ్యం తరం తెలిపారు. వారిని బయటకు పంపించాలని డి మాండ్‌ చేశారు. దీంతో సభలో వాగ్వాదం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా, వెల్దండ మండల సమావేశంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేకాధికారి జయశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి సర్పంచ్‌లతో పాటుగా మహిళా సర్పంచ్‌ల భర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు శాఖల వారీగా ప్రగతి నివేదికలను చదువుతుండగా సర్పంచ్‌ కొండల్‌యాదవ్‌ అభ్యంతరం తెలిపారు. ప్రజా ప్రతినిధులు కానివారు సభ నుంచి బయటకు వెళ్లాల న్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదానికి దిగి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి సమావేశానికి వచ్చారు. అంత కుముందు బయటకు వెళ్లిన వారు అతడితో పాటు లోపలికి వచ్చారు. దీంతో కొండల్‌యాదవ్‌తో పాటూ, శ్రీనివాసులు, రమేష్‌గౌడ్‌ అభ్యంతరం తెలిపారు. సర్పంచులు కానివారు బయటకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. దీంతో వారి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సీఐ రఘువీర్‌రెడ్డి జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కానీ మహిళా సర్పంచుల భర్తలు మాత్రం సభ నుంచి బయటకు వెళ్లలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడతూ నిబంధ నలకు అనుగుణంగా వ్యవహరించాలని, మరోమారు ఇలాంటి సంఘటనలు జరకుండా చూడాలని ప్రత్యేకా ధికారి జయశ్రీకి సూచించారు. అనంతరం శాఖల వారీ గా సమీక్ష నిర్వహించారు. పలు గ్రామాలకు మిషన్‌భగీరథ నీరు రావడం లేదని సర్పంచులు తెలిపారు. పోతేపల్లి, అజిలాపూర్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడ్తానన్నారు. సమావేశంలో ఎంపీడీవో సులోచన, తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌, వివిధ శాఖల ఏడీఏలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:25 PM