Share News

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:21 PM

వ నపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం ఆగారం గ్రామానికి చెందిన బొంకూరు బుడ్డయ్య(37) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

భార్య కాపురానికి రావడం లేదని  భర్త ఆత్మహత్య

ఖిల్లాగణపురం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం ఆగారం గ్రామానికి చెందిన బొంకూరు బుడ్డయ్య(37) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం చెన్నమ్మతో వివా హం కాగా దాంపత్య విబేధాల కారణంగా భార్య చెన్నమ్మ రెండు నెలలుగా హైదరాబాద్‌లో నివా సం ఉంటుంది. భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త తీవ్ర మ నస్తాపానికి గురై ఈ నెల 22వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగి అ పస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి వనపర్తి జిల్లా ఆ సుపత్రికి తరలించి, అనంతరం మహబూబ్‌నగర్‌ తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా ఈయనకు పదేళ్ల క్రితం వివాహం కాగా, ఆమె కూడా వదిలి వెళ్లింది. మృతుడి సోదరుడు బొంకూరు కుర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 07:58 AM