కాలకృత్యాలకు అవస్థ ఇంకెన్నాళ్లు?
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:53 PM
నాటి ప్రభుత్వం ఉన్నఫ లంగా ప్రారంభించిన గురుకులాలు చాలాచోట్ల నేటికీ అద్దె భవనాల్లోనే కొన సాగుతున్నాయి.
చౌరస్తా గురుకులంలో నిలిచిన నిర్మాణ పనులు
అలంపూరు చౌరస్తా, జూలై 12 (ఆంధ్రజ్యోతి): నాటి ప్రభుత్వం ఉన్నఫ లంగా ప్రారంభించిన గురుకులాలు చాలాచోట్ల నేటికీ అద్దె భవనాల్లోనే కొన సాగుతున్నాయి. అద్దెభవనాల్లో ప్రభుత్వ నిధుల వినియోగంపై ఉన్న అవాం తరాల వల్ల నేటికీ అరకొర వసతులతోనే విద్యార్థులు తమ చదువులు కొన సాగిస్తున్నారు. పుస్తకాలపై పొరాటం చేస్తునే సమస్యలతోనూ యుద్ధం చే యాల్సిన పరిస్థితి దాపురించింది. మహాత్మాజ్యోతిబా పులే శాంతినగర్ బా లుర గురుకుల పాఠశాల ఆది నుంచి అలంపూరు చౌరస్తాలో ఓ అద్దెభవ నంలో కొనసాగుతుంది. యజమాని తీరుతో మొదటి నుంచీ ఇక్కడి విద్యా ర్థులతో పాటు ఉపాధ్యాయులు, వచ్చిన ప్రిన్సిపాళ్లు కూడా ఇబ్బందిపడుతు నే ఉన్నారు. గడిచిన విద్యాసంవత్సరంలో ఇక్కడ వసతులేమి, తాగునీరు, స రిపడా టాయిలెట్లు లేకపోవడం తదితర కారణాల చేత విద్యార్థులే స్వయం గా 44వ జాతీయ రహదారిపై పాదయాత్రగా కలెక్టరు వద్దకు బయలుదేరి న ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రభుత్వ ఒత్తిడితో అప్పటి కలెక్టర్ బీఎం సంతోష్‌కుమార్ హుటాహుటిన వచ్చి టాయిలెట్ గదుల కో సం, తాగునీటి అవసరాల కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ నిధులు మంజూరు కాలేదు.చేసేది లేక సొసైటీ నుంచి టాయిలెట్ గదులు నిర్మించేందుకు విడతల వారీగా భవన యజమానికి రూ.17 లక్షలు అకౌంట్‌లో వేశారు. గత విద్యా సంవత్సరంలో టాయిలెట్ నిర్మాణాలు మొదలుపెట్టిన యజమాని, పనుల ను అర్ధంతరంగా నిలిపేశాడు. నాలుగు నెలలుగా ఎక్కడిపనులు అక్కడే ఉ న్నాయి. ప్రస్తుతం పాఠశాలలో 480 మంది విద్యార్థులకు 16 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. సరిపడకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇప్పటికే ఆరుబయటికి వెళ్తున్నారు. దీనికితోడు ఇక్కడ గతేడాది నుంచి ఇంటర్ తరగతులకు అనుమతులు వచ్చినా.. వసతులలేమి, నిర్మాణ దశలో ఉన్న గదులు అందుబాటులోకి రాకపోవడంచేత, ఈ ఏడాది ఇంటర్ తరగ తులను కేటీదొడ్డికి తరలించామని ప్రిన్సిపాల్ దివ్య తెలిపారు. ప్రస్తుత కలె క్టర్ చొరవ తీసుకుని అర్దంతరంగా నిలిచిన టాయిలెట్ల నిర్మాణాలకు నిధు లు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.