Share News

పోలీస్‌ బండి నడిచేదెలా?

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:00 AM

పోలీస్‌ స్టేషన్‌ల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. పోలీస్‌ స్టేషన్లకు ప్రభుత్వం ప్రతీ నెల ఇస్తు న్న మెయింటెనెన్స్‌ ఖర్చు రూ.25 వేల నుంచి రూ.50 వేలు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒక్కో స్టేషన్‌ అధికారికి నెలకు 100-120 లీటర్ల డీజిల్‌ కోటా ఉంటుంది.

పోలీస్‌ బండి నడిచేదెలా?

నిర్వహణకు సరిపోని మెయింటెనెన్స్‌ డబ్బులు

ఒక్కో వెహికిల్‌కు గవర్నమెంట్‌ నెలకు ఇస్తున్నది 100-120 లీటర్ల డీజిల్‌ కోటా

కానీ రెండింతలు అదనంగా అవసరం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 1200 పోలీస్‌ వాహనాలు

పీటీ వారెంట్లు, బందోబస్తు, కోర్టు డ్యూటీ ఖర్చులు అదనం

పెరుగుతున్న భారం

తగ్గించుకునేందుకు దందాలు, సెటిల్‌మెంట్లపై దృష్టి!

మహబూబ్‌నగర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టేషన్‌ల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. పోలీస్‌ స్టేషన్లకు ప్రభుత్వం ప్రతీ నెల ఇస్తు న్న మెయింటెనెన్స్‌ ఖర్చు రూ.25 వేల నుంచి రూ.50 వేలు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒక్కో స్టేషన్‌ అధికారికి నెలకు 100-120 లీటర్ల డీజిల్‌ కోటా ఉంటుంది. కానీ 250-300 లీటర్ల డీజిల్‌ వినియోగం అవుతోంది. దాంతోపాటు బందోబస్తు, పీటీ వారెంట్లు, కోర్టు డ్యూటీ, ఎస్కార్ట్‌ ఖర్చులు అదనంగా ఉంటాయి. వీటన్నింటి భారం తట్టుకునేందుకు పోలీసులు పక్కచూపులు చూస్తున్నారు. ఆదాయం సమకూర్చుకునేందుకు అక్రమ దందాలు, పంచాయతీ సెటిల్‌మెంట్‌లపై దృష్టి సారించాల్సి వస్తోంది. ఈ వేటలో సా మాన్యులు బలి అవుతున్నారన్నది కూడా బహిరంగ రహస్యమే..

డీజిల్‌ ఖర్చులు తడిసి మోపెడు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 78 పోలీస్‌ స్టేషన్‌లు ఉండగా, 6 సబ్‌ డివిజనల్‌ కార్యాలయా లు, 19 సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. వివిధ కేటగిరీలలో పనిచేసే వి భాలన్నింటికీ కలిపి దా దాపు 1200 పోలీస్‌ వాహనాలు ఉన్నాయి. ఇందులో స్టేషన్‌ అధికారుల వాహనాలు, పె ట్రో వాహనాలు, బ్లూకోల్ట్స్‌, ఎస్కార్ట్‌, బందోబస్తు వాహనాలు ఉ న్నాయి. ఒక్క మహబూబ్‌గర్‌ జిల్లాలో నే 262 వాహనాలు ఉన్నాయి. వీటిలో పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు ఇచ్చే వాహనాలకు 100-120 లీ టర్ల వరకు నెలకు డీజిల్‌ కోటా ఉంది. కానీ చాలా పోలీస్‌ స్టేషన్‌లు మహబూబ్‌నగర్‌ రూరల్‌, జడ్చర్ల వంటి పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు నెలకు రెండొందల పైగానే డీజిల్‌ వినియోగం అవుతోంది. మండల పోలీస్‌ స్టేషన్‌లదీ అదే పరిస్థితి. ప్రతీ రోజు గ్రామాలు, ఎస్పీ కార్యాలయం, సర్కిల్‌ కార్యాలయం, బందోబస్తు తిరగడం వల్ల డీజిల్‌ కోటా కన్నా అదనంగా వినియోగం అవుతోంది. మండలంలో సీఎం బందోబస్తు ఉన్నా, మంత్రుల మీటింగ్‌లు ఉ న్నా అదనంగా డీజిల్‌ వి నియోగించాల్సి వస్తోంది. పోలీస్‌ వాహనాలకు ఇ న్సూరెన్స్‌లు కూడా చేయ డం లేదు. వాహనాలు ప్ర మాదాలకు గురైనా, టైర్లు మార్చాలన్నా, సర్వీసింగ్‌ ఆ తర్వాత ఇతరత్ర మెయింటెనెన్స్‌ కూడా సంబంధిత అధికారులే భరించాల్సి వస్తోంది.

ఖర్చుల కోసం పక్కదారి

ఈ ఖర్చుల భారం అధిగమించేందుకు చాలామంది పోలీసులు పక్కదారులు వెతుక్కుంటున్నారు. తమ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నడిచే ఇసుక దందా, అక్రమ మద్యం, కల్లు వ్యాపారాలు, భూ పంచాయతీలు, స్టేషన్‌కు వచ్చే పంచాయతీలను ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. డబ్బులు సంపాదించే వేటలో చాలామంది పోలీస్‌ స్టేషన్‌ నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణకు సమయం కేటాయించడం లేదన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే డబ్బులు ఇవ్వాల్పిందే అన్న స్థితికి వచ్చింది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించి పోలీస్‌ స్టేషన్‌ల నిర్వహణను మెరుగురపరిచి సామాన్యులు, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకురావాలంటే..

కొన్ని దొంగతనాల కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగల ప్రమేయం ఉన్నపుడు ఆయా రాష్ట్రాలకు పోలీస్‌ బృందాన్ని పంపించాల్సి వ స్తుంది. వారి ఖర్చులన్నీ పోలీసులే భరించాలి. కొన్ని కేసుల లో వారం రోజుల పాటు అక్క డే ఉండాల్సి వస్తుంది. సీఎం బందోబస్తుకు వచ్చే పోలీసుల కు భోజనం ఖర్చులు, పీటీ వా రంట్లలో ఖైదీలను పట్టుకురావ డం, కోర్టు డ్యూటీ, ఐజీ కార్యాలయాలకు తిరగడం, హైకోర్టు రిట్‌ పిటిషన్‌లు ఉంటే కోర్టుకు తిరడగం, వీఐపీ ఎస్కార్ట్‌ వంటి ఖర్చులు పోలీస్‌ స్టేషన్‌లను నిర్వహించే అధికారులకు అదనపు భారంగా మారుతున్నాయి. కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని పట్టుకోస్తే వారికి కూడా భోజన ఖర్చులు పోలీసులే భరించాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లా కేంద్రంలో ఎస్‌హెచ్‌ఓ పోలీస్‌ స్టేషన్‌లకు నెలకు రూ.50 వేలు, మండల పోలీస్‌ స్టేషన్‌లకు రూ.25 వేలు ఇస్తున్నారు. ఇది కూడా 3-6 నెలలకోసారి ఇస్తున్నారు. ఆ డబ్బులు స్టేషన్‌ నిర్వహణ అంటే స్టేషనరీ, టీ ఇతరత్ర ఖర్చులకు మాత్రమే సరిపోతున్నాయి. ఇదివరకు ఈ ఖర్చులు కూడా స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి వసూలు చేసేవాళ్లు.

Updated Date - Jun 29 , 2026 | 12:00 AM