Share News

అన్ని వసతులతో ఇళ్లు నిర్మించుకోవాలి

ABN , Publish Date - May 14 , 2026 | 11:18 PM

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

అన్ని వసతులతో ఇళ్లు నిర్మించుకోవాలి
ధరూర్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

ధరూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మగౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం సహకరిస్తున్నదని చెప్పారు. గురువారం ధరూర్‌ మండలం అల్లపాడు, ధరూరు, పలుగ్రామాల్లో లబ్ధిదారులు అనంతరెడ్డి, గోవిందు, షఫి ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని ఇంటి యజమానులుగా మారడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:18 PM