Share News

హాస్టల్‌ వార్డెన్‌, వర్కర్ల సస్పెన్షన్‌

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:18 PM

కొత్తకో ట పట్టణంలోని కళాశాల బీసీ బాలికల హాస్టల్‌ లో అస్వస్థతకు గురైన విద్యార్థులు వనపర్తి జి ల్లా కేంద్రంలో చికిత్స పొంది ఆరోగ్యం కుదుట పడడంతో శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు.

  హాస్టల్‌ వార్డెన్‌, వర్కర్ల సస్పెన్షన్‌
కళాశాల బీసీ బాలికల హాస్టల్‌ను పరిశీలిస్తున్న జిల్లా అధికారుల బృందం

- ఆస్పత్రి నుంచి విద్యార్థుల డిశ్చార్జి

- హాస్టల్‌ను పరిశీలించిన అధికారులు

కొత్తకోట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కొత్తకో ట పట్టణంలోని కళాశాల బీసీ బాలికల హాస్టల్‌ లో అస్వస్థతకు గురైన విద్యార్థులు వనపర్తి జి ల్లా కేంద్రంలో చికిత్స పొంది ఆరోగ్యం కుదుట పడడంతో శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. శుక్రవా రం రాత్రి విద్యార్థులు భోజనం చేశాక 18 మంది అస్వస్థతకు గురి కావడంతో జిల్లా అస్పత్రి త రలించారు. విషయం తెలుసుకున్న వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మే ఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అధికారు లు ఆస్పత్రిలో విద్యార్థులను పరామ ర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు గు రికి కారణమైన హాస్టల్‌ వార్డెన్‌ విజయ, వ ర్కర్లు సస్పెండ్‌కు గురయ్యారు. బీసీ వెల్ఫెర్‌ రా ష్ట్ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్వేతా ప్రియదర్శిని అదన పు కలెక్టర్‌ కిమ్యా నాయక్‌, జిల్లా విద్యాధికారి అ బ్దుల్‌ ఘని, డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్‌ సాయి నాథ్‌రెడ్డి, జిల్లా వెను కబడిన తరగతుల అధికా రి ముజాయిద్‌ ఖాన్‌ వసతి గృహాల జిల్లా హాస్ట ల్‌ను పరిశీలించి విచా రణ చేపట్టారు. విద్యార్థు లతో మాట్లాడి భోజనాలపై ఆరా తీశారు. అ న్నం, పప్పు, సంబారులను పరిశీలించారు. అలా గే హాస్టల్‌ పరిసరాలను, కూరగాయలు, బియ్యం, సరుకులను పరిశీలించారు. కిమ్యా నాయక్‌ వెంట తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కమిషనరు సైదయ్య ఉన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 11:18 PM