Share News

కొట్ర చౌరస్తా వద్ద హైటెన్షన్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:19 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల పరిధిలోని హైదరాబాద్‌ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న కొట్ర చౌరస్తావద్ద ఆదివారం హైటెన్షన్‌ నెలకొంది.

  కొట్ర చౌరస్తా వద్ద హైటెన్షన్‌
జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో మాట్లాడుతున్న పోలీసు అధికారి

- కుమ్మెర వెళ్తున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేసేందుకు పోలీసుల మోహరింపు

వెల్దండ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల పరిధిలోని హైదరాబాద్‌ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న కొట్ర చౌరస్తావద్ద ఆదివారం హైటెన్షన్‌ నెలకొంది. నాగర్‌కర్నూల్‌ మండలం కుమ్మెర గ్రామంలో మల్లికార్జునస్వామి జాతరలో మృతిచెందిన నవజాత శిశువు కుటుంబాన్ని పరామర్శించేందుకు తీన్మార్‌ మల్లన్న వెళుతున్న నేపథ్యంలో అతన్ని ముందస్తుగా అరెస్ట్‌ చేసేందుకు కల్వకుర్తి డీఎస్సీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్వంలో సీఐలు నాగార్జున, రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐలు కురుమూర్తి, వీరబాబు, కృష్ణదేవలతో పాటు పలువురు పోలీసులు కొట్ర చౌరస్తా వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల నుంచి 12.30 వరకు హైడ్రామా నడుమ హైదరాబాద్‌ నుంచి వస్తున్న తీన్మార్‌ మల్లన్న కొరకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో కుమ్మెర గ్రామానికి పరామర్శకు వెళుతున్న జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కొద్దిసేపటికే వచ్చిన తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్‌ చేద్దామనుకునే సరికి పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశానుసారం పరామర్శకు అనుమతి వచ్చిందని డీఎస్పీ చెప్పడంతో పోలీసులు తప్పుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తీన్మార్‌ మల్లన్న కుమ్మెరకు వెళ్లిపోగా, అతని వెనకాలే జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ బయలుదేరారు.

రాష్ట్రంలో రాచరిక పాలన

- బీసీ ఇంటలెక్చువల్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు

నాగర్‌కర్నూల్‌ క్రైం, ఫిబ్రవరి 22 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని బీసీ ఇంటలెక్చు వల్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు ఆరోపించారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కుమ్మెర జాతర దాడి బాధితుల నిరసన శి బిరాన్ని చిరంజీవులు సందర్శించి పరామ ర్శించి జరిగిన ఘటన విషయాలను తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కుమ్మెర జాతర ఘటనలో దాడికి పాల్పడిన వారిపై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా రూ.50 లక్షలు ఆర్ధిక సహాయం అందజేసి వారి కు టుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని ఆయన డి మాండ్‌ చేశారు.

- దాడికి పాల్పడిన వారిని రక్షించే ప్రయత్నంలో సీఎం

కుమ్మెర గట్టు జాతర వద్ద బీసీ రజక కుటుంబంపై దాడి చేసి పసిబిడ్డ చావుకు కారణమైన వారిని రక్షించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని బీసీ క్రాంతిదళ్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో బాధితులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి బాధితుల ను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈ కే సుపై దర్యాప్తు చేసి అసలైన నిందితులను శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటే ము ఖ్యమంత్రికి మంచిదని హితవు పలికారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామ ని ఆయన హెచ్చరించారు.

ముగ్గురి అరెస్టు

గత నాలుగు రోజుల క్రితం కుమ్మెర మల్లికార్జునస్వామి దేవస్థానం ఆ వరణలో జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫిర్యాదులో ముగ్గురిని అరెస్టు చేసి రి మాండ్‌కు తరలిస్తున్నట్లు నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. గత నాలు గు రోజుల క్రితం దేవస్థాన నిర్వాహకులు గ్రామానికి చెందిన గణేష్‌ కుటుంబ సభ్యులతో జరిగిన గొడవకు సంబంధించి చిన్నారి మృతి చెందగా, వివాదం మరింత రాజుకుంది. ఈ సంఘటనపై చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కుమ్మెర గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలి స్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సంఘట నపై పూర్తిస్థాయి విచారణ జరుపుతు న్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. చిన్నారి మృ తిపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కే సులు నమోదు చేసి బాధ్యులపై అందరి పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ ఎస్‌ఐ గోవర్ధన్‌, తెలకపల్లి ఎస్‌ఐ నరేష్‌, తాడూరు ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:19 PM