సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:36 PM
వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల ను తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధిం చవచ్చని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు.
రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
వంగూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల ను తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధిం చవచ్చని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డ్డి సొంత గ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూ రు మండలంలోని కొండారెడ్డిపల్లిలో భూసార పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్య క్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్, కమిటీ బృందం, ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ బదావ త్ సంతోష్ హాజరయ్యారు. రైతువేదిక వద్ద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగం వి ధానం, సేంద్రియ వ్యవసాయం ప్రయోజనా లపై అవగాహన కల్పించారు. రైతుల ఉద్దేశిం చి చైర్మన్ మాట్లాడుతూ పంటల అభివృద్ధి, అధిక దిగుబడుల సాధనలో మట్టి పరీక్ష అ త్యంత కీలకమని అన్నారు. రైతులు పంటలు విత్తే ముందు తప్పని సరిగా తమ భూముల పరీక్ష చేయించుకోవాలన్నారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ దేశ వ్యవసాయ రంగ అభివృద్ధిలో తొలి భారత ప్రధాని నెహ్రూ కీలక పాత్ర పో షించారని, దూరదృష్టితోనే హరిత విష్లవానికి బలమైన పునాదులు పడినట్లు తెలుస్తుంద న్నారు. నేడు దేశంలో రెండు సంవత్సరాలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు ఉండటం ఆయన చేపట్టిన విధాన ఫలితమేన్నారు. ఆ ధునిక వ్యవసాయ సాంకేతికతను ప్రోత్సహిం చడం భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చా రని గుర్తుచేశారు. అదే తరహలో రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి నాయకత్వంలో వ్యవ సాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రైతులకు అ వసరమైన యూరియ, ఎరువుల పంపిణీ స మర్థవంతంగా చేపడుతూ వ్యవసాయం లా భసాటిగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీ సుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడు తూ రసాయన ఎరువులను వాడటంతో కేవ లం పంట దిగుబడి తగ్గిపోతుందని మాత్ర మే కాదని, పెట్టుబడులు ఎక్కువగా ఖర్చువు తాయన్నారు. ప్రభుత్వం రైతుల వద్దకే పరీ క్షలు నిర్వహించేలా రైతు కేంద్రాల వద్దకి భూసార పరీక్షలను తీసుకొచ్చిందన్నారు. కా ర్యక్రమంలో సర్పంచ్ మల్లెపాకుల వెంక టయ్య, కేవీఎన్ రెడ్డి, వెంకన్న, నర్సింహారెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ సంఽ ద్యారాణి, రైతు కమిషన్ కార్యదర్శి గోపాల్, బ్రజేంద్ర, రాంప్రకాశ్, జిల్లా వ్యవసాయ అది కారి యశ్వంత్‌రావు, ఉపసర్పంచ్ వేమారెడ్డి, ఏవో ప్రియదర్శిని పాల్గొన్నారు.