Share News

హెలిటూర్‌ వాయిదా

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:11 PM

హైదరాబాద్‌ నుంచి సోమశిల మీదుగా శ్రీశై లం వరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న హెలిటూరిజం వాయిదా పడింది.

హెలిటూర్‌ వాయిదా

- సోమశిల వద్ద ఏర్పాట్లు పూర్తి కాకపోవడమే కారణం

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నుంచి సోమశిల మీదుగా శ్రీశై లం వరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న హెలిటూరిజం వాయిదా పడింది. గురు వారం నుంచి హెలి టూరిజం అమల్లోకి రావా ల్సి ఉండగా వివిధ కారణాలతో రద్దైంది. ఈ పర్యటన కోసం నాగర్‌కర్నూలు జిల్లా సోమశి లలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌ స్థలం విష యంలో చోటుచేసుకున్న వివాదాల కారణంగా పనులు ఆలస్యమైన క్రమంలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కావడానికి అనుకూలమైన పరిస్థితి లే కపోవడం వల్ల పర్యటన తాత్కాలికంగా వా యిదా పడిందని పర్యాటక శాఖ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. హెలిటూరిజంలో భాగంగా ఒక్కొక్కరికి రూ. లక్ష 10 వేల ప్యాకే జీని నిర్ణయించిన పర్యాటక శాఖ ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆరుగురు ప్రయాణించే సామర్థ్యం ఉన్న హెలికాప్టర్‌లో ఉదయం 5:30 గంటలకు బేగంపేట నుంచి బయల్దేరి నేరుగా సోమశిలకు చేరుకునే విధంగా ప్రణా ళికను రూపొందించారు. సోమశిలలో సోమేశ్వ రాలయాన్ని సందర్శించి కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసిన తర్వాత మధ్యాహ్న భోజనం ముగించుకొని తిరిగి 12:30 గంటలకు హెలి కాప్టర్‌ సోమశిల నుంచి బయల్దేరి కృష్ణానది మీదుగా చీ మలతిప్ప, జిల్దార్‌తిప్ప, ఆకాశగంగ, నీలిగంగ, ఆక్టోపస్‌ మీదుగా మధ్యాహ్నం 2గంటల వరకు శ్రీశైలం చేరుకునే విధంగా ప్రొగ్రామ్‌ను డిజైన్‌ చేశా రు. అక్కడ భ్రమరాంబ మల్లికార్జునస్వామిని వీఐపీ తరహాలో దర్శించుకున్న తర్వాత తిరిగి సాయంత్రం 6:30 గంటల వరకు హైదరాబా ద్‌కు చేరుకునే విధంగా హెలిటూరిజం వ్యవ స్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అ యితే క్షేత్రస్థాయిలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాలుగురోజుల వ్యవధిలో హెలి టూరిజం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.

Updated Date - Apr 08 , 2026 | 11:11 PM