Share News

కల్తీ లేని ఆహారంతోనే ఆరోగ్యం పదిలం

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:32 PM

ఫుడ్‌ పాయిజన్‌ అయితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రజలు కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.

కల్తీ లేని ఆహారంతోనే ఆరోగ్యం పదిలం
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

  • జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఫుడ్‌ పాయిజన్‌ అయితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రజలు కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్బంగా మొదటిరోజు సోమవారం ఫుడ్‌సేఫ్టీ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పాత డీఎం హెచ్‌వో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఫుడ్‌సేఫ్టీ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవాలని, ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు వేడిగా వండుకొని భుజించాలన్నారు. ఆహారాన్ని వండే ముందు చేతులను, పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కృత్రి మ రంగులు ఉన్న ఆహార పదార్థాలకు దూరం గా ఉండాలన్నారు. జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారు లు హోటళ్లు, రెస్టారెంట్లలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని, వీరికి సంబంధించిన ఇ తర శాఖల అధికారులు అవసరమైన సహాయ సహకారాలను అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మ యి, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌, ప్రోగ్రాం అధికా రి రాజు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధుసూదన్‌రెడ్డి, సీసీ వెంకటేశ్‌, జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ శ్యాంసుందర్‌ ఉన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:32 PM