Share News

ప్రాణాలనుఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:41 PM

కేసీఆర్‌ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రా ష్ట్రాన్ని సాధించాడని అలంపూర్‌ ఎమ్మెల్యే విజ యుడు అన్నారు.

ప్రాణాలనుఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు
అయిజలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, పాల్గొన్న పార్టీ నాయకులు

  • దీక్షా దివస్‌ కార్యక్రమంలో అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

  • జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు

  • గద్వాలలో పాల్గొన్న ఇన్‌చార్జి బాసు హనుమంతునాయుడు, నాయకులు

అయిజ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రా ష్ట్రాన్ని సాధించాడని అలంపూర్‌ ఎమ్మెల్యే విజ యుడు అన్నారు. ఆదివారం అయిజ మునిసిప ల్‌ చైర్మన్‌ సీఎం సురేశ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అడ్వకేట్‌ మధుకుమార్‌ ఆధ్వ ర్యంలో దీక్షా దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళిఅర్పించారు. అనంతరం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనం తరం మాట్లాడారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదు ర్కొని ఉద్యమాలు, ప్రాణత్యాగాలతో సాధించుకు న్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చ టమే కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ సీఎం.సురేష్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ స చ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నిరా హార దీక్ష చేపట్టారని, ప్రాణాలను సైతం లెక్కచే యకుండా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడని కొనియాడారు. రాబోయేరోజుల్లో తిరిగి కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకువచ్చి బంగారు తెలంగా ణను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కా ర్యకర్తపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ముని సిపల్‌ వైస్‌చైర్మన్‌ మాల నర్సింహులు, కౌన్సిలర్లు రాజాక్‌, శివ, తిరుమలేశ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింహరెడ్డి, రంగుమద్దిలేటి, జామాలుద్దీన్‌, దే వరాజ్‌, యేబు, అంజి, ఎలియాజర్‌, కురువపల్ల య్య పాల్గొన్నారు.

ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిన దీక్షా దివస్‌

గద్వాల,(ఆంధ్రజ్యోతి) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబరు 29వ తేదీ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉందని, దీక్షా దివస్‌ తెలం గాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పిందని బీఆర్‌ఎస్‌ పార్టీ గద్వాల ఇన్‌చార్జి బా సు హనుమంతునాయుడు అన్నారు. ఆదివారం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి దీక్షా దివస్‌ నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు అనంతరం జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కో సం కేసీఆర్‌ చేపట్టిన దీక్ష దేశ రాజకీయాలలో కీలక మలుపు అన్నారు. తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం అవడానికి కారణం అయ్యిం దన్నారు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, యు వత ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమంలో పా ల్గొని రాష్ట్ర ఆకాంక్షలను బలంగా వినిపించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని స్మరించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉందన్నారు. మూడున్నరకోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం, దీక్ష ప్రజల ఆకాంక్షలకు ప్రతీక గా నిలిచాయని అన్నారు. అంతకుముందు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, మాజీ జడ్పీటీసీ బాసు శ్యా మల, పద్మావెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పులిపాటి వెంకటేశ్‌, టీఎన్‌ ఆర్‌ జగదీశ్‌, సంటెన్న, మోహన్‌యాదవ్‌, దుబ్బన్న, గోపాల్‌, నాయకులు రాఘవేంద్రరెడ్డి, సూర్యగౌడ్‌, చిత్తారి కిరణ్‌, అతికుర్‌ రహిమాన్‌, బీచుప ల్లి, ఆల్లపాడు ప్రతాప్‌, గంజిపేట రాజు, అవనిశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 11:41 PM