Share News

మేకలు మేపేందుకు అడవిలోకి వెళ్లి..

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:20 PM

మేకల మేత కోసం అడివికి వెళ్లి తప్పిసోయిన కాపరి రెండు రోజుల పాటు చిట్టడవిలో ఉంటూ పోలీసుల సహయంతో బయట పడిన ఘటన మహబూ బ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం ఆచార్యపూర్‌లో చోటు చేసు కుంది.

మేకలు మేపేందుకు అడవిలోకి వెళ్లి..
కృష్ణయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

- రెండు రోజుల తర్వాత డ్రోన్‌ సాయంతో గుర్తించి.. రక్షించిన పోలీసులు

కోయిలకొండ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మేకల మేత కోసం అడివికి వెళ్లి తప్పిసోయిన కాపరి రెండు రోజుల పాటు చిట్టడవిలో ఉంటూ పోలీసుల సహయంతో బయట పడిన ఘటన మహబూ బ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం ఆచార్యపూర్‌లో చోటు చేసు కుంది. మండలంలోని ఆచార్యపూర్‌ గ్రామానికి చెందిన జాజలి కృష్ణ య్య ఈ నెల 8వ తేదీ వీరగట్టు వెనుక ఉన్న అటవీ ప్రాంతానికి మేక లను మేత కోసం తీసుకెళ్లాడు. అటవీ నుంచి మేకలు ఇంటికి వచ్చా యి. కానీ కృష్ణయ్య రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అ టవీలో వెతికినా ఆయన జాడ కనిపించలేదు. దీంతో 9వ తేదీన కృ ష్ణయ్య తల్లి జాజలి మంగమ్మ కోయిలకొండ పోలీసులకు ఫిర్యాదు చే సింది. ఎస్పీ జానకి ఆదేశాలతో అదనపు పోలీసులు గురువారం అట వీలో డ్రోన్‌ సహాయంతో కృష్ణయ్య ఆచూకీ కొనుగొన్నారు. డ్రోన్‌ తిరుగు తున్న ప్రదేశం శింగనకొండ నుంచి కృష్ణయ్య గ్రామానికి చేరుకున్నాడు. అటవీలో నీరు జాలు ప్రాంతంలో ఇరుక్కొని నీరు తాగుతూ రెండు రో జులు గడిపానని కృష్ణయ్య తెలిపాడు. రెండు రోజుల నుంచి కని పించకుండా పోయిన కృష్ణయ్య ఇంటికి వచ్చే సరికి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 10 , 2026 | 11:20 PM