Share News

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:16 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, నాయకులు

- మంత్రి జూపల్లి కృష్ణారావు

- మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఇ బ్బందులు లేకుండా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చామని తెలిపారు. మొక్కజొన్నకు కనీస మద్ధతు ధరగా రూ.2,400 చెల్లిస్తూ, రైతులకు చెల్లింపులు తక్షణమే జరిగేలా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఇబ్బందులు కలగ కుండా కొనుగోలు నిరంతరం కొనసాగించాలని, మార్కెట్‌ యార్డులో రై తులకు టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆ దేశించారు. కార్యక్రమంలో కొల్లాపూర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యో తి, కౌన్సిలర్లు వంగ అనూష, పసుల సుజాత, స్వప్న శిల్ప, బింగి జ యలక్ష్మి, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 11:16 PM