మహిళా ఉద్యోగినులపై వేధింపులు
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:51 PM
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిపాలన అ స్తవ్యస్తంగా మారిం ది. పరిపాలన విభా గంలోని ఓ ఉన్నతాధికారి కొందరు మ హిళా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి.
జనరల్ ఆసుపత్రి పరిపాలనా విభాగంలోని ఉన్నతాధికారి బాగోతం
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల విధుల కేటాయింపుల్లో బెదిరింపులు
షాడో సూపరింటెండెంట్‌గా శానిటరీ ఇన్‌స్పెక్టర్
సెలవు, సంతకం ఏది కావాలన్నా ముందుగా అతన్నే కలవాలి
అస్తవ్యస్తంగా దవాఖానా పరిపాలన
మహబూబ్‌నగర్ (వైద్య విభాగం), జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిపాలన అ స్తవ్యస్తంగా మారిం ది. పరిపాలన విభా గంలోని ఓ ఉన్నతాధికారి కొందరు మ హిళా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్ షాడో సూపరింటెండెంట్‌గా వ్య వహరిస్తుండటం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పరిపాలన విభాగం ఓ ఉన్నతాధికారి కొంతమంది మహిళా ఉద్యోగినులను టార్గెట్ చేసి, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనకు నచ్చితే ఓ సెక్షన్, నచ్చకపోతే 2, 3 నెలలకు ఒక సెక్షన్ మారుస్తూ ఇబ్బందులు పెడుతున్నారని కొందరు మ హిళా ఉద్యోగినులు వాపోతున్నారు. పది నిముషాలు ఆలస్యమైనా సెలవు వేయిస్తున్నారని, కొంతమం ది ఆయన వేధింపులు భ రించలేక ఆ కార్యాలయం నుంచి మరో కా ర్యాలయానికి వె ళ్లిపోయారని తెలిసింది. బయటకు చెప్తే ఉద్యోగాలు తీ సేస్తారేమోనని బాధ లు భరిస్తున్నామని వా పోతున్నారు. ఇదిలా ఉండగా ఆ యన ఏనాడూ సమయానికి రాలేదని తెలుస్తోంది. రోజూ 11 గంటల తర్వాతే వస్తుంటారని, ఒక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ, మరో వర్గం వారికి వేరే సెక్షన్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
జాబ్ చేయకుంటే వెళ్లిపోవాలని హుకుం
గత ప్రభుత్వంలో నియమించిన దాదాపు 40 మంది ఉద్యోగులను పొమ్మనక పొగబెట్టినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారం తా పేషెంట్ కేర్ అటెండర్లుగా నియామకాలు తీసుకున్నారు. 6 నుంచి 8 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల వారి విధుల కేటాయింపులో షఫ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎవరికి ఏ ఆర్డర్ ఉంటే దాని ప్రకారమే చేయాలని, చేయని వారుంటే రాసిచ్చి వెళ్లాలని బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5, 6 ఏళ్లు రికార్డులు రాసుకుంటూ ఉన్న తాము రోగుల వీల్‌చైర్లు తో యాలంటే ఎలా తోస్తామని కొందరు వాపోతున్నారు.
షాడో సూపరింటెండెంట్..
ఆసుపత్రిలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే ఓ ఉద్యోగి షాడో సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి అంతా కోడై కూ స్తోంది. సెలవు, సంతకం కావాలన్నా, డ్యూటీలు మార్చాలన్నా ఆయన చెప్తే ఇట్టే జరిగిపోతుందని అంటున్నారు. ముందు తనతో చెబితే ఆ తర్వాత సార్‌కు చెప్తా అంటూ వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నట్లు విమర్శలున్నాయి. దీనివలన డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో జరిగే ప్రతీ వ్యవహారంలో ఆయన భాగస్వామ్యం ఉంటుందనేది నగ్న సత్యం.
నా దృష్టికి రాలేదు
పరిపాలన విభాగంలో మహిళా ఉద్యోగినులను వేధిస్తున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. నేరుగా వచ్చి వారి సమస్యను చెప్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాను. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, అధికారులు, సిబ్బంది ఎవరైనా సరే ఎప్పుడైనా నన్ను కలవొచ్చు. సమస్యలు చెప్పుకోవచ్చు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటా.
- డాక్టర్ రంగా అజ్మీర, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్