కృతజ్ఞత సభ విజయవంతంపై హర్షం
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:29 PM
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వ హించిన సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ విజ యవంతం కావడంతో జడ్చర్ల కాంగ్రెస్ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
జడ్చర్ల, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వ హించిన సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ విజ యవంతం కావడంతో జడ్చర్ల కాంగ్రెస్ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు నిత్యానందం, అశోక్‌యాదవ్ మా ట్లాడారు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్ర స్థానాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్త యిన సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండల ప్ర జలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సభ నిర్వ హించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధిగా తనను గెలిపించిన ఉమ్మడి మిడ్జిల్ మండల అభి వృద్ధికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రతిపా దనలు పంపించారన్నారు. ఈ సందర్భంగా ఉ మ్మడి మిడ్జిల్ మండలానికి దాదాపు రూ.80 కో ట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బాదేపల్లి మా ర్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రాజేందర్‌గౌడ్, కాంగ్రె స్ నాయకులు బుక్క వెంకటేశం, జనార్దన్‌రెడ్డి, మినాజ్, సుదర్శన్‌గౌడ్, మాలిక్ షాకీర్, ఎర్ర ఆనంద్, అనుప కృష్ణయ్య, లక్ష్మమ్మ ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గా గోపాల్, పట్టణ అధ్యక్షుడుగా వంశీకృష్ణచారి ని శాలువాతో సన్మానించారు.
ఇది ప్రజా విజయం
మిడ్జిల్ : మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూ ర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరు ధ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి మిడ్జిల్ కాంగ్రెస్ మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజా విజయంగా వారు అభివ ర్ణించారు. సభకు తరలివచ్చిన ప్రజలు, సహక రించిన జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ శంకర్, మార్కెట్ ఛైర్మన్ జ్యోతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గౌస్, నాయకులు రమేష్, నరేందర్‌రెడ్డి, వెంకటయ్య, మల్లికార్జున్‌రెడ్డి, సం పత్‌కుమార్, సాయిలు పాల్గొన్నారు.