జ్ఞానేశ్‌కుమార్‌ను సీఈసీ పదవి నుంచి తప్పించాలి
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:42 PM
కేం ద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను మంటగ లిపిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని అఖిల పక్షం, ప్రజాసంఘాల నాయకులు ముక్తఖంఠం తో డిమాండ్ చేశారు.
అఖిలపక్షం, ప్రజాసంఘాల డిమాండ్
గద్వాలటౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కేం ద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను మంటగ లిపిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని అఖిల పక్షం, ప్రజాసంఘాల నాయకులు ముక్తఖంఠం తో డిమాండ్ చేశారు. గురువారం రాత్రి పట్ట ణంలోని కృష్ణవేణి చౌరస్తాలో అఖిలపక్షం, ప్ర జాసంఘాల నాయకులు సీఈసీకి వ్యతిరేకంగా నిరసన, ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు, జేఏసీ కన్వీ నర్ మధుసూదన్‌బాబు మాట్లాడుతూ ఇద్దరు సహచర కమిషనర్ల మద్దతు లేకుండా, వారిద్ద రి భిన్నాభిప్రాయాన్ని సైతం పరిగణలోకి తీసు కోకుండా ఫామ్-6లో మార్పులు చేసిన సీఈ సీపై వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. ఈవిషయంలో సుప్రీంకోర్టు అనుమతి ఉందం టూ సీఈసీ చేసిన బుకాయింపు న్యాయ వ్యవ స్థను సైతం తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నా రు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దే శంగా ఉన్న భారత్‌లో జరుగుతున్న పార్లీమెం టరీ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై, గౌరవం పెరగాలన్నా, విశ్వసనీయత నిలవాలన్న జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణం తొలగించాలన్నారు. కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, టీజేఎస్ జిల్లా కన్వీనర్ ఆలూరు ప్రకాశ్‌గౌడ్, బీ ఆర్‌ఎస్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య, సీపీఎం నాయకుడు నరసిం హ, టీపీఎఫ్ నాయకుడు ప్రభాకర్, సీఎల్‌సీ ఉ మ్మడి జిల్లా అద్యక్షుడు సుభాన్, ఇతర సంఘా ల నాయకుల వెంకన్న, దానయ్య, వాల్మీకి, వినోద్‌కుమార్, కార్తీక్, నాగన్న, రెహ్మతుల్లా, ప్రేమ్‌కుమార్ ఉన్నారు.