Share News

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:35 PM

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీక రించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి రమేశ్‌ అధికారులను ఆదే శించారు.

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
ఫిర్యాదును పరిశీలిస్తున్న ఆర్డీవో రమేశ్‌

- రెవెన్యూ డివిజనల్‌ అధికారి రమేశ్‌

నారాయణపేట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీక రించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి రమేశ్‌ అధికారులను ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరిస్తు దర ఖాస్తులు సమర్పించారు. కార్యక్రమానికి మొ త్తం 20 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దని, ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్క రించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 11:35 PM