శీరస్తు.. శుభమస్తు..
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:30 PM
వివాహ వేడుకలకు వేళయ్యింది. గత ఏడాది డిసెంబరు 14 నుంచి ఈ ఏడాది జనవరి 30 వరకు దాదాపు 50 రోజుల పాటు శుక్రమౌఢ్యమి (మూఢాలు) కారణంగా శుభ కార్యాలకు బ్రేక్ పడింది.లీనెలలో మహా శివరాత్రి, అనంతరం ఫాల్గుణ మాసం, కామదాహనం, హోలీ పండుగలు ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు ఇష్టపడరు.
- వివాహ వేడుకలకు వేళాయె!
నారాయణపేట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : వివాహ వేడుకలకు వేళయ్యింది. గత ఏడాది డిసెంబరు 14 నుంచి ఈ ఏడాది జనవరి 30 వరకు దాదాపు 50 రోజుల పాటు శుక్రమౌఢ్యమి (మూఢాలు) కారణంగా శుభ కార్యాలకు బ్రేక్ పడింది.లీనెలలో మహా శివరాత్రి, అనంతరం ఫాల్గుణ మాసం, కామదాహనం, హోలీ పండుగలు ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు ఇష్టపడరు. అత్యవసరం అనుకుంటేనే ముహూర్తాలు చూసుకుంటారు. వచ్చేనెల 19న పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం ఉంది. ఆ తర్వాత కొత్త పంచాంగం ప్రకారం ముహూర్తాలు చూసుకొని, వివాహాది శుభకార్యాలు జరుపుకుంటారు. ఈ నెల 20, 22 తేదీల్లో పలు వివాహాలు జరిగాయి. ఈనెల మరో మూడు వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి. వచ్చే నెల నుంచి ముహూర్తాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. సెంటిమెంట్ రీత్యా ఆశాఢమాసంలో వివాహ ముహూర్తాలున్నప్పటికీ నారాయణపేట ప్రాంత వాసులు వివాహలు జరుపుకునేందుకు ఆసక్తి చూపరు. శ్రావణమాసంలో ముహూర్తాలు ఉన్నా, ఇళ్లలో శ్రావణమాస వ్రతాలు, పూజలు ఉంటాయి. వివాహం చేస్తే మాంసాహార వంటకాలకు అవకాశం ఉండదు. దీంతో చాలా మంది ఈ మాసంలోనే వివాహాలు నిశ్చయించుకోరు. అలాగే మే 17 నుంచి జూన్ 15 వరకు జేష్టమాసం (అధికమాసం) ఉండటం వల్ల ముహూర్తాలు లేవు. భాద్రపదం, ఆశ్వీజ మాసాల్లో గణపతి నవరాత్రులు, పితృపక్షాలు, దేవీ నవరాత్రులు దృష్ట్యా ముహూర్తాలు లేవు. ఉన్న కొద్ది ముహూర్తాలలో వధూవరుల తారాబలం, చంద్రబలం కలిసి వచ్చేవి చూసుకొని నిశ్చయించుకుంటారని నారాయణపేటకు చెందిన స్మార్ధ కృష్ణ యజుర్వేద పండితులు విభావసు పురోహిత్ తెలిపారు. దీంతో ఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు డిమాండ్ నెలకొననున్నది. ఇప్పటికే ముహూర్తాలు నిశ్చయించుకున్న వారు ఫంక్షన్‌హాళ్లను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, మంగళవాయిదాలు, పురోహితులు, సెటింగ్స్ తదితర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు భారంగా మారాయి.
ఈ ఏడాది శుభ ముహూర్తాలివే..
ఫిబ్రవరి :25, 26, 27
మార్చి: 5,6,8,11,12,26, 28, 29
ఏప్రిల్: 1,3,4,8,11,12, 25,26, 27, 29
మే: 1,3,6,8,9,13
జూన్: 17, 20, 24, 25, 27
జులై: 2, 3, 5, 9
ఆగస్టు: 15, 23, 26, 30
నవంబరు: 1,5,15,20,22,25,26,29
డిసెంబరు: 3,4,19,25.26,30