చేప పిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:59 PM
చేప పిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టెండర్ల నిర్వ హణకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- సరఫరాకు మత్స్యశాఖ సన్నాహాలు
- వనపర్తి జిల్లాలో ఐదు రిజర్వాయర్లు, 900 చెరువులు
- నేటి నుంచి ప్రారంభం కానున్న టెండర్ల ప్రక్రియ
వనపర్తి, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): చేప పిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టెండర్ల నిర్వ హణకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వనపర్తి జి ల్లాలో చేపపిల్లల సరఫరాకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది. జిల్లా వ్యాప్తంగా 143 మత్స్యశాఖ సహకార సంఘాలు ఉండగా 1,430 మంది సభ్యులు ఉన్నారు. ఐదు రిజర్వాయర్లు, 900 చెరువులు ఉన్నాయి. వీటిలో మొత్తం 2.36 కోట్ల చేప పిల్లలను వదిలేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.
2.36కోట్ల చేప పిల్లలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని 5రిజర్వాయర్లు, 900చెరువుల్లో 2కోట్ల 36లక్షల చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో రిజర్వాయర్లు, మేజర్ చెరువుల్లో, 80ఎంఎం నుంచి 100ఎంఎం సైజు గల కోటి చేప పిల్లలను వదులనున్నారు. వీటికి రూ.1.82 పైసల చొప్పున ధర నిర్ణయించారు. అలాగే జిల్లాలోని చిన్న చెరువుల్లో 35ఎంఎం నుంచి 40ఎంఎం సైజ్ గల 1.36కోట్ల చేప పిల్లలు వదలాలని నిర్ణయిం చారు. వీటికి రూ.0.68 పైసల చొప్పున చెల్లించేలా ధర ఖరారు చేశారు. అయితే ఈ సారి టెండర్ల ప్ర క్రియ ఆలస్యం కావడం, చేప పిల్లలు వేసే గడు వు సమీపిస్తుండడంతో ఆగస్టు నెలాఖరులోపు సీడ్ పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 11నుంచి టెండరుదారుల నుంచి దరఖాస్తులు స్వీక రించనున్నారు. జిల్లాలోని చెరువుల్లో ఇప్పటి వరకు 50 శాతం వరకు నీరు చేరలేదు. చెరువుల్లో 1/3 శాతం నీరు ఉంటేనే చేప పిల్లలు వదలనున్న నేప థ్యంలో టెండర్లు అయ్యే సరికి భారీ వర్షాలు కుర వాలని మత్స్యకార్మికులు కోరుకుంటున్నారు.