వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:09 PM
మండలంలోని షేక్‌పల్లిలో ఆదివారం శివాంజనే య స్వామి ఆలయ, దేవాతమూర్తుల ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు.
హన్వాడ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని షేక్‌పల్లిలో ఆదివారం శివాంజనే య స్వామి ఆలయ, దేవాతమూర్తుల ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా హోమాలు, శివలింగం, పార్వతి, గణపతి, సుబ్రమణ్యస్వామి, నంది, ధ్వజస్తంభం, బొడ్రాయి, పోచమ్మ, నాగదేవత, నవ గ్రహాలకు పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై పూజలు చేశారు. కరుణాకర్‌గౌడ్, నరేందర్, శ్రీనివాసులు, వెంకటయ్య, రాము పాల్గొన్నారు.
కోయిలకొండ : మండలంలోని మ ల్కాపూర్‌లో ఆంజనేయస్వామి, ధజస్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామస్థుల గోవింద నామాలతో ధ్వజ స్తంభాన్ని ఎత్తారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చిట్టెం అభిజయ్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వ హించారు. ఆలయ అభివృద్ధికి చిట్టెం అభిజయ్‌రెడ్డి రూ.2.50 లక్షలను ఆలయ కమిటీకి అంద జేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్, గ్రామ సర్పంచు రవియాదవ్, ఉప సర్పంచు భగవంత్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌రెడ్డి, నారాయణయాదవ్, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.