Share News

వైభవంగా చెన్నకేశవస్వామి తెప్పోత్సవం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:12 PM

గద్వాల చారిత్రక కోటలో వెలసిన సంస్థానాధీ శుల కులదైవం శ్రీ భూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవా రం స్వామివారిని ఆలయ ప్రాంగణంలో గరుడ వాహనంపై ఊరేగించారు.

వైభవంగా చెన్నకేశవస్వామి తెప్పోత్సవం
లింగంబావిలో తెప్పోత్సవం

  • భూలక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై ఊరేగిన స్వామి వారు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : గద్వాల చారిత్రక కోటలో వెలసిన సంస్థానాధీ శుల కులదైవం శ్రీ భూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవా రం స్వామివారిని ఆలయ ప్రాంగణంలో గరుడ వాహనంపై ఊరేగించారు. ఉదయం ఆలయం లో స్వామివారికి ఫల పంచామృతాభిషేకం, విశే ష పుష్పాలంకరణ తదితర పూజలు శాష్ర్తోక్తం గా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సతీమణి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి స్థానిక చారిత్రక లింగం బావిలో స్వామి ఉత్సవ మూర్తులతో నిర్వహించిన తెప్పోత్సవం వైభవం గా నిర్వహించారు. ఉత్సవంలో ఇండియ్‌ రెడ్‌క్రా స్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ సంగాల అయ్యపురెడ్డి, ఆలయ విచారణకర్త దిన్నె ప్రభాకర్‌రావు పాల్గొ న్నారు. అంతకుపూర్వం లింగంబావిలో ఉన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ మేనేజర్‌ శ్రీపాదజోషి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:12 PM