ఘనంగా దసరా వేడుకలు
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:44 PM
జిల్లా కేంద్రంలోని కేసరి సము ద్రం ట్యాంక్‌బండ్ దసరా వేడుకలతో కళ కళలాడింది.
- విద్యుద్దీపాల వెలుగుల్లో ట్యాంక్‌బండ్
- శమీ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి దంపతులు
- పెద్ద సంఖ్యలో హాజరైన పట్టణ ప్రజలు
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 21 (ఆం ధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కేసరి సము ద్రం ట్యాంక్‌బండ్ దసరా వేడుకలతో కళ కళలాడింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుద్దీపాల వెలు గులతో ట్యాంక్‌బండ్ సందర్శకులను కను విందు చేసింది. మహిళల కోలాటాలు, బొడ్డెమ్మల ఆటపాటలు, యువత నృత్యాల తో విజయదశమి వేడుకలను సంబురంగా జరుపుకొన్నారు. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నా రు. అంతకు ముందు ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి దంపతులు శమీ పూజలో పాల్గొన్నారు. అ నంతరం బతుకమ్మ ఘాట్ వద్ద పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద మహిళలతో కలిసి ఎమ్మెల్యే దంపతులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉం డాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నా యకుడు దిలీప్‌చారి, మునిసిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేశ్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.