ఘనంగా బతుకమ్మ సంబురాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:30 PM
మద్దూర్ మండలంలో బతు కమ్మ సంబురాలను ఆదివారం ఘ నంగా నిర్వహించారు.
మద్దూర్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మద్దూర్ మండలంలో బతు కమ్మ సంబురాలను ఆదివారం ఘ నంగా నిర్వహించారు. స్థానిక ముని సిపల్ కార్యాలయ ఆవరణలో బతుక మ్మ వేడుకలను మునిసిపాలిటీ ఆధ్వ ర్యంలో నిర్వహించగా, చైర్పర్సన్ సర స్వతీజనార్దన్, కమిషనర్ శ్రీకాంత్, కౌ న్సిలర్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. రెండో వార్డు కౌ న్సిలర్ మున్కన్పల్లి నర్సింహ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైస్ చైర్పర్సన్ భా గ్యశ్రీ, కౌన్సిలర్లు మునకన్పల్లి నర్సిం హ, మోనికాప్రకాశ్, దినేష్, మహి మూద్, సంగీతరమేష్, నాయకులు భీములు, వెంకట్రాములు, శివకుమా ర్, ఉస్మాన్, బాబు, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో...
నారాయణపేట న్యూటౌన్: స్థానిక వారియర్స్ డిఫెన్స్ అకాడమీ వారు ఆదివారం లయన్స్క్లబ్ భవన్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా ని ర్వహించారు. అకాడమీ చైర్మన్, ల యన్స్క్లబ్ ఆఫ్ నారాయణపేట 320-ఏ అధ్యక్షుడు రవికుమార్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా లయన్ హరినారాయణ భట్టడ్, సరితభట్టడ్లు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆకాం క్షించారు. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ డా.శాంతఆంజనేయులు, ఇన్ చార్జి ఎస్.చక్రవర్తి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకట్రాములు, క్లబ్ సభ్యులు, మహిళలు, విద్యార్థులు పా ల్గొన్నారు.