Share News

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:42 PM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జములమ్మ ఆలయంలోవైభవంగా ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలంకరణ, పూలతో అలంకరించారు.

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
గద్వాల అన్నపూర్ణేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన చేస్తున్న మహిళలు

  • మహాలక్ష్మీ దేవిగా జములమ్మ దర్శనం

  • మొదటి పూజను నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు

  • పలుచోట్ల బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారి దర్శనం

గద్వాల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జములమ్మ ఆలయంలోవైభవంగా ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలంకరణ, పూలతో అలంకరించారు. మొదటిరోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి పూజను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వీరికి ఈఓ పు రేందర్‌కుమార్‌, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కుంకుమార్చన మండపంలో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు జెండాను ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం అ మ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ఉ త్సవాల్లో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అన్నపూర్ణే శ్వరి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. వీర భద్రస్వామి, అన్నపూర్ణేశ్వరి, భక్తమార్కండేయ, కాళి కాదేవి ఆలయాల్లో, కుమ్మరి సంఘం, ఆరెకటిక సంఘం మండపాల్లో బాలాత్రిపుర సుందరిదేవిగా అమ్మవారు పూజలందుకున్నారు. అంబాభవానీ ఆలయంలో మహేశ్వరిదేవిగా, పాండురంగ శివాలయంలో శైలపుత్రిదేవిగా, కన్యకాపరమేశ్వరి, తాయమ్మదేవి ఆలయాల వద్ద మూకాంబికదేవిగా కొలువయ్యారు. ఈసందర్భంగా ఆలయాల్లో మహిళలు సామూ హిక కుంకుమార్చన చేశారు.

Updated Date - Oct 11 , 2026 | 11:42 PM