వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:34 PM
జిల్లా వ్యాప్తంగా వివిధ శక్తి స్వరూపిణి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్స వాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభ మయ్యాయి
- నగరమంతా ఆధ్యాత్మిక శోభ
- అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర మేయర్
మహబూబ్‌నగర్ న్యూటౌన్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా వివిధ శక్తి స్వరూపిణి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్స వాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభ మయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరణలు చేసి, కుంకుమార్చన, చండీయాగాలు నిర్వహించారు. పట్టణంలోని వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆభరణాలను పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షు డు గుద్టేటి శివప్రసాద్ ఇంటి నుంచి ఊరేగింపుగా, మేళతాళాలతో ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత ఉ మాదేవిగా అలంకరించి, పూజలు నిర్వహించారు. పట్టణంలోని చౌడేశ్వరి ఆలయంలో, పిల్లల మర్రి రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వా మి ఆలయం, తోట మైసమ్మ ఆలయంలో అమ్మ వారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రా రంభించారు. కొత్తగంజ్‌లోని లక్ష్మీ న ర్సింహస్వామి ఆలయంలో శర న్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నగర మేయర్ మమత, టీపీసీసీ ప్రధాన కా ర్యదర్శి ఏపీ మిఽథున్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూ జారులు రాఘవేంద్రశర్మ, శ్రీ కాంత్‌శర్మ, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి రా ఘవేందర్, కోశాధికారి చంద్రశేఖర్, మీడియా ఇన్‌చార్జి హనుమంతు, రమేష్, విజయ్‌కుమార్, కార్పొరేటర్ యాదయ్య పాల్గొన్నారు.
జడ్చర్ల : పట్టణంలోని శ్రీవాసవీకన్యక పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని శ్రీశైలపుత్రి దేవీగా అలంకరించి పూజలు నిర్వహించారు. సకలదేవతల ఆలయంలో శ్రీబాలాత్రిపురసుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సంద ర్భంగా గౌరీగణపతిపూజ, పణ్యాహవాచనం, అంకురార్పణం, నవగ్రహపూజ, ధ్వజారోహ ణం కార్యక్రమాలను నిర్వహించారు.
దేవరకద్ర/నవాబ్‌పేట/ భూత్పూర్/మూసాపేట/మహబూబ్ నగర్ రూరల్/హన్వాడ : దేవరకద్ర, కౌకుంట్ల మండల కేంద్రాల్లో మొదటి రోజు అమ్మవారు భక్తులకు శ్రీ శైల పుత్రి దేవిగా దర్శనం ఇచ్చారు. నవాబ్‌పేట మండలం పర్వతాపూర్ మైస మ్మ అమ్మవారు బాల త్రిపురసుంద రీగా దర్శనం ఇచ్చారు. కాకర్లపాడ్ ఉప సర్పంచు అంబేడ్కర్ అమ్మవారికి మొక్కులు తీర్చుకు న్నారు. భూత్పూర్ మునిసిపాలిటీ కేంద్రంలోని భూత్పూర్, గోప్లాపూర్, అమిస్తాపూర్, షిర్డీసాయి ఆశ్రమంలో అమ్మవారిని బాలత్రిపుర సుందరీ దేవిగా అలంకరించారు. మూసాపేట, మహబూ బ్‌నగర్ రూరల్, హన్వాడ మండల కేంద్రాల్లో దుర్గామాతను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.