ఇక ధాన్యం విక్రయాలు ఇక్కడే..
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:22 PM
ఇ క రైతులకు కష్టాలు తొలగినట్లే.. అయిజకు కొత్తగా వ్యవసాయ మార్కెట్‌యార్డు ఏర్పా టు కానుండటంతో కొత్త కళ సంతరించుకో నున్నది.
- అయిజలో వ్యవసాయ మార్కెట్‌యార్డు ఏర్పాటు
అయిజ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇ క రైతులకు కష్టాలు తొలగినట్లే.. అయిజకు కొత్తగా వ్యవసాయ మార్కెట్‌యార్డు ఏర్పా టు కానుండటంతో కొత్త కళ సంతరించుకో నున్నది. ఇదివరకు అయిజ వ్యవసాయ మా ర్కెట్ గద్వాల మార్కెట్ యార్డు నందు సబ్- మార్కెట్‌గా కొనసాగింది. అదే సమయంలో ఆర్డీఎస్ ఆయకట్టు కింద వరి, జొన్న, కంది, వేరుశనగ లాంటి పంటలు సమృద్ధిగా పం డటంతో అధిక దిగుబడి వచ్చేది. వాటిని అ యిజ మార్కెట్‌లో రైతులు విక్రయించేవారు. రైతులకు ఖర్చులు తగ్గేవి. అప్పటి నియోజక వర్గాల ఏర్పాటులో భాగంగా అయిజ మండ లాన్ని అలంపూర్ నియోజకవర్గంలో భాగం గా ఏర్పాటు చేయటంతో అప్పటి నుంచి అ లంపూర్ యార్డు నందు అయిజ సబ్‌మా ర్కెట్ కొనసాగుతూ వ చ్చింది. వర్షాలు సక్ర మంగా కురవకపోటం, పంటల దిగుబడి అం తంతమాత్రంగా ఉండ టం, అయిజ మార్కెట్ యార్డు నందు వసతు లు లేకపోవటం, కొను గోలుదారులు లేకపోవ టంతో కార్యకలాపాలు దారుణంగా పడిపోయా యి. దీంతో మార్కెట్ యార్డు మాటే ఎత్తటం లేదు. ఈ తరుణం లో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో భాగంగా కొనసాగిన అయిజ మార్కెట్ యా ర్డుకు కొత్త కళ వచ్చింది. నూతనంగా కొత్త మార్కెట్ యార్డుగా ప్రకటించటం జరిగింది. ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబరు 46 కింద గ త నెల 19వ తేదీన ప్రకటించింది. అయిజ మండలంలోని 31 గ్రామాలు, రాజోళి మండ లంలోని 13 గ్రామాలను కలుపుకుని అయిజ ను ప్రత్యేక మార్కెట్ యార్డు కింద ప్రకటిం చారు. వసతులు కల్పించి కొనుగోలుదారులు మార్కెట్‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకుం టే ఫలితం ఉంటుందని రైతులు అంటున్నా రు. కాగా, ఈ జీవో విషయం తాజా మాజీ అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప ధ్రువీకరించారు.