Share News

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:28 PM

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం వివిధ ప థకాలను ప్రవేశపెట్టిందని, అర్హులైన వారంద రూ సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వా న్‌బాషా షేక్‌ అన్నారు.

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

గద్వాల అర్బన్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం వివిధ ప థకాలను ప్రవేశపెట్టిందని, అర్హులైన వారంద రూ సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వా న్‌బాషా షేక్‌ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వీక్‌లో భాగంగా మహిళ, శి శు, దివ్యాంగుల, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన యో గా కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. వృద్ధులు ఉల్లాసంగా ఉండేందు కు నిత్యం యోగా, నడక, పుస్తకాలు చదవడం, ఇష్టమైన పాటలు వినడం, ఇతర హాబీలత జీవి తాన్ని సంతోషంగా గడపాలని సూచించారు. బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే యో గా, ధ్యానం కార్యక్రమాలను వృద్ధులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు ర్యాలీని జిల్లా సంక్షేమ అధికారి సునంద జెండా ఊపి ప్రారంభించారు. బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఇండోర్‌ స్టేడియం వరకు విద్యార్థులు, వయోవృద్ధులు, సీనియర్‌ సిటిజన్లు ర్యాలీ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈవో విజయలక్ష్మి, రిటైర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు అయ్యపు రె డ్డి, డీసీపీవో నరసింహ, యోగా శిక్షకులు గా యత్రి, డాక్టర్‌ సురేఖ, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:28 PM