కాంగ్రెస్ పార్టీ వారికే ప్రభుత్వ పథకాలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:40 PM
కాంగ్రెస్ పార్టీ వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
వర్షాలతో వచ్చిన నీటిని, కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసినట్లుగా మంత్రులు అబద్ధపు ప్రచారం
గట్టు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. గురువారం గట్టులో సీనియర్ నాయకుడు మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో బీ జేపీ కార్యకర ్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరు ణ హాజరై మాట్లాడారు. తెలంగాణలో రాబోయే ది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఇతర ప్రభు త్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే అం దుతున్నాయన్నారు. అర్హులు ఉన్నప్పటికీ ఇవ్వ డం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా పథకాలు అందజేయ డం జరిగిందన్నారు. గద్వాల పట్టణ మునిసిపా లిటీలో కోట్ల రూపాయల పన్ను వసూలు చేసుకొని రూ.లక్షల్లో లెక్కలు చూపుతూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే గద్వాలను అమ్మడానికి కూడా వెనకాడరని ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రి మంత్రులు కర్ణాటకకు వెళ్లి డ్రామాల చేశారని అన్నారు. వ ర్షాలతో వచ్చిన నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసినట్లుగా చూపించి, అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం తె లంగాణకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదన్నారు. నీటి కోసం రైతులు ఆందోళన చేస్తే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కార్యక్రమం లో సీనియర్ నాయకులు బల్గెర శివారెడ్డి, డీకే స్నిగ్దారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు బల్గెర నల్లారెడ్డి, మండల అధ్యక్షు డు సురేశ్, వీరశేఖర్‌గౌడు, నరసింహులు గౌడు, రంగనాయుడు తదితరులు పాల్గొన్నారు.