Share News

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:24 PM

మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొ రేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, కార్పొరేషన్‌ చైర్మన్‌

  • రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌

  • గోనుపాడులో ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే బండ్ల

గద్వాలటౌన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొ రేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చే యడంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పొందిన 135మంది మైనార్టీ మహిళలకు ఇందిరమ్మ మైనార్టీ మహిళ శక్తి పథకం ద్వారా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మా ట్లాడిన చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, త్వరలోనే మరో 200 మంది మహిళలకు కుట్లు మిషన్లను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి, కౌన్సిలర్‌ ఎండీ బాబర్‌, మాజీకౌన్సిలర్‌ ఇసాక్‌, శ్రీను ముదిరాజ్‌, నాయకులు అతిక్‌ఉర్‌ రెహమాన్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్‌ పాషా పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 11:24 PM