Share News

ప్రజా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Apr 18 , 2026 | 10:59 PM

ప్రజా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అ న్నారు. ప్రమాద రహిత తెలంగాణ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రమాదాలు జరుగకుండా రవాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ప్రజా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట
హెల్మెట్‌ ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి తదితరులు

ప్రమాదరహిత తెలంగాణే లక్ష్యం

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

యువత నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు: మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్‌నగర్‌ విద్యా విభాగం, ఏపిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అ న్నారు. ప్రమాద రహిత తెలంగాణ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రమాదాలు జరుగకుండా రవాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పంచవటి పాఠశాలలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, పశుసంవర్థక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కుచూకుళ్ల దామోదర్‌రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల నుంచి పంచవటి పాఠశాల వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ అవగాహన పార్కును, హెల్త్‌క్యాంపును వారు ప్రారంభించారు. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై పాఠశాల విద్యార్థులు ప్రదర్శనలు ఇ చ్చారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్ర తీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రి వా కిటీ శ్రీహరి మాట్లాడుతూ యువత నిర్లక్ష్యంగా వా హనాలు నడపటం వ ల్లే చాలా వరకు ప్ర మాదాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం కలెక్టర్‌ ఖుష్భూగుప్తా, ఎస్పీ జానకి, బాలల హక్కుల పరిరక్ష ణ కమిటీ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అ ధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో రవాణశాఖ కమిషనర్‌ ఇలాంబర్తి, ఆ ర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మహబూబ్‌నగర్‌ మే యర్‌ గులాల్‌ మమత, వైస్‌ మేయర్‌ సురేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత పాల్గొన్నారు.

అలిగిన మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో మంత్రులతో కలిసి పాల్గొన్న మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ను నిర్వాహకులు స్టేజీపైకి పిలవలేదు. దాంతో ఆయన అలిగారు. తర్వాత గుర్తు చేయగా ఆయన్ను సేజీపైకి రావలని పిలవగా రాలేదు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అతని దగ్గరకు వెళ్లి స్టేజీపైకి తీసుకొచ్చారు.

Updated Date - Apr 18 , 2026 | 10:59 PM