Share News

‘శ్రీశైలం’లో నీరున్నా ఎత్తిపోయడంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:11 AM

శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నా, ఎంజీకేఎల్‌ఐ ద్వారా నీటిని ఎత్తిపోయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూ ర్తిగా విఫలమవుతోందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు.

‘శ్రీశైలం’లో నీరున్నా ఎత్తిపోయడంలో  ప్రభుత్వం విఫలం
గుడిపల్లి రిజర్వాయర్‌ వద్ద నీటి ఎత్తిపోతలను పరిశీలిస్తున్న మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు

- 24 గంటలు నిరంతరాయంగా మోటార్లు నడిపించాలి

- లేకపోతే పంప్‌హౌస్‌ల వద్ద రైతులతో కలిసి ఆందోళన

- మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి హెచ్చరిక

- మాజీ ఎమ్మెల్యేలతో కలిసి గుడిపల్లి రిజర్వాయర్‌ పరిశీలన

కందనూలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నా, ఎంజీకేఎల్‌ఐ ద్వారా నీటిని ఎత్తిపోయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూ ర్తిగా విఫలమవుతోందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని గుడిపల్లి పంప్‌హౌస్‌ను వారు శుక్ర వారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో కలిసి పరి శీలించారు. పంప్‌హౌస్‌లో మోటార్ల పనితీరు, నీటి ఎత్తి పోతలను పరిశీలించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రులు మాట్లా డుతూ ఎంజీకేఎల్‌ఐ మోటార్లను ఉదయం వేళ నడిపి రాత్రి పూట నిలిపివేస్తున్నారన్నారు. ప్రతీ రోజు 24 గం టల పాటు విద్యుత్‌ అందించి నిరంతరాయంగా మో టార్లను నడిపించాలని డిమాండ్‌ చేశారు. ఇష్టానుసారంగా మోటార్లను నిలిపివేయడం వల్ల తరుచూ మరమ్మతుకు వస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ వాటా నీటిని వినియోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ వైపు తరలిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎత్తిపోతల మోటార్లను సక్రమంగా నడపకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నా రు. రైతులతో కలిసి లిఫ్ట్‌ల వద్ద వంటావార్పు నిర్వ హిస్తామని హెచ్చరించారు. వారి వెంట బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:11 AM