కొలువుదీరిన పీఏసీఎస్‌ల పాలకవర్గాలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:29 PM
పుటాన్ దొడ్డి సహకార రైతు సంఘం పాలకవర్గం గురు వారం కొలువుదీరింది. అధ్యక్షుడిగా మధునాయు డు, ఉపాధ్యక్షుడిగా వేముల శ్యాంసుందర్‌తో పా టు మరో 11మంది డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు.
హాజరై సన్మానించిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
ఎర్రవల్లి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పుటాన్ దొడ్డి సహకార రైతు సంఘం పాలకవర్గం గురు వారం కొలువుదీరింది. అధ్యక్షుడిగా మధునాయు డు, ఉపాధ్యక్షుడిగా వేముల శ్యాంసుందర్‌తో పా టు మరో 11మంది డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రైన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిలను సన్మానించి శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం మాట్లడుతూ ప్రజాపాలన ప్ర భుత్వంలో సహకార సంఘాలకు ప్రతినిధులుగా ఎన్నికైన నూతనపాలకవర్గం రైతుల శ్రేయస్సుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ని ఏడు సహకార సంఘాలకు చైర్మన్, వైస్ చై ర్మన్‌లుగా సామాజికన్యాయంతో భర్తీ చేశామ న్నారు. సొసైటీ పరిధిలో రైతులకు కావాల్సిన ప్ర తీ అంశంపై దృష్టిపెట్టాలని, వారికి మేలు చేయ డమే మీ లక్ష్యంగా భావించాలన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ అ ధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్, మాజీ సర్పంచ్ జోగుల రవి, డీసీసీ కార్యదర్శి సిరాజ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఈదన్ననాయుడు, కొండేరు వెంకటేశ్ పాల్గొన్నారు.
మానవపాడు,(ఆంధ్రజ్యోతి):మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గురువా రం నూతన కార్యవర్గం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం జరిగిం ది. మానవపాడు చైర్మన్‌గా రామచంద్రరెడ్డి, వైస్ చైర్మన్‌గా చెన్నకృష్ణారెడ్డి పలువురు డైరెక్టర్లుగా ప్రమాణస్వీకరం చేశారు. కార్యక్రమంలో సంపత్‌కుమార్ మాట్లాడు తూ రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని, ఎల్‌నినో కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సొసై టీ బ్యాంక్ మేనేజర్ బాబు, సీఈవో శ్రీనివాస్‌రె డ్డి, డీసీసీ కార్యదర్శి సీరాజ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేశ్ ఉన్నారు.