పాలమూరులో క్రీడలకు మంచి రోజులు
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:33 PM
పాలమూరు జి ల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుదామని జిల్లా యువజన క్రీడల అధికా రి జె. రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
- డీవైఎస్‌వో జె.రాజశేఖర్‌రెడ్డి
- ఉత్సాహంగా రాష్ట్ర వాలీబాల్ అకాడమీ ఎంపికలు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు జి ల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుదామని జిల్లా యువజన క్రీడల అధికా రి జె. రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వాలీబాల్ అకాడమీ అం డర్-16 బాల, బాలికల విభాగంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపి కలను డీవైఎస్‌వో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో క్రీడలకు మంచి రోజులు రానున్నాయన్నారు. జిల్లాకు వాసులు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్‌రెడ్డి, మంత్రి వాకిటీ శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, నా లుగు స్తంభాలుగా ఉన్నారని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో పాల మూరు అభివృద్ధి చెందుతుందన్నారు. క్రీడల్లో జిల్లా వాసులు రాణిస్తు న్నారని, వాలీబాల్ క్రీడాకారులు అంతర్జాతీయస్థాయి ఎదిగారని గుర్తు చేశారు. జిల్లాకు రాష్ట్ర వాలీబాల్ అకాడమీ, కబడ్డీ అకాడమీ రావటం హర్షణీయమన్నారు. ప్రతిభ చాటి అకాడమీకి ఎంపికావాలన్నారు. కా ర్యక్రమంలో జిల్లా వాలీబాల్ సంఘం ఉపాధ్యక్షుడు గులాం దస్తగిర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నవీరయ్య, సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సాయికృష్ణ, కోచ్‌లు పర్వేజ్‌పాష, అబ్దుల్ రహె మాన్, సునీల్, సయ్యద్ అంజద్, రాజగోపాల్, శంకర్, ఉమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాట్, సీనియర్ కోచ్‌ల పర్యవేక్షణలో ఎంపికలు జరిగాయి. ఎత్తు, ష టిల్‌రన్, ఎబిలిటీ పరీక్ష, వాలీబాల్ క్రీడల్లో నైపుణ్యాలు తదితర విభా గాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎంపికలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 71 బాలురు, 24 మంది బాలికలు హాజరయ్యారు.