కత్తితో బెదిరించి.. బంగారం అపహరణ
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:44 PM
ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలి ని ఆటో ఎక్కించుకొని దారి మధ్యలో ఆపి నగదు, బంగారు ఆభరణాల ను దోచుకున్నారు.
- సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల పట్టివేత
భూత్పూర్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలి ని ఆటో ఎక్కించుకొని దారి మధ్యలో ఆపి నగదు, బంగారు ఆభరణాల ను దోచుకున్నారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన మహబూబ్‌నగర్ జి ల్లా భూత్పూర్ మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కుమారుడు పిచ్చకుంట్ల బాలరాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్ కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం జిల్లా పోలీస్ డిప్యూటీ సూపరిం టెండెంట్ వెంకటేశ్వర్లు సమక్షంలో రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘ టనకు సంబంధించి డీఎస్పీ, సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. భూత్పూర్ పట్టణాని కి చెందిన రాములమ్మ వృత్తి రీత్యా కూరగాయలు అమ్ముకుంటూ జీవి స్తుంది. రాములమ్మ జిల్లా కేంద్రం నుంచి కూరగాయలు తెచ్చుకోవడానికి ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో బస్సు ఎ క్కడానికి భూత్పూర్ చౌరస్తా దగ్గర నిలబడి ఉన్నది. ఈ తరుణంలో తి మ్మాజిపేట మండలానికి చెందిన మనెమోని శివుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే విధంగా జడ్చర్ల పట్టణంలోని జౌకినగర్ ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడైన మహ్మద్ అక్రమ్ వృత్తి రీత్యా చికెన్ కొట్టు వ్యాపారం చేసుకొని జీవిస్తున్నాడు. వీరు ఇద్దరు ఈ నెల 3వ తేదీన తెల్ల వారుజామున 3.30గంటల ప్రాంతంలో భూత్పూర్ చౌరస్తా మీదుగా మ హబూబ్‌నగర్ వెళుతున్నట్లుగా అక్కడే బస్సు కోసం వేచి ఉన్న రాముల మ్మను ఆటో ఎక్కించుకొని అమిస్తాపూర్ సాక్షి దేవాలయం ఎదురుగా చె ట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. అదే ఆటోలో వెనుక సీటులో కూర్చున్న మహ్మ ద్ అక్రమ్ రాములమ్మకు కత్తి చూపించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తె, చెవికమ్మలు, రూ.5వేల నగదును లాక్కుని వెళ్లిపోయారు. వీటి వి లువ సుమారుగా రూ.75వేలు ఉంటుంది. అదే రోజు బాధితురాలు తన కుమారుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భూత్పూర్ ఎస్‌ఐ చం ద్రశేఖర్ పట్టణంలోని చౌరస్తా పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు, అదేవి ధంగా అమిస్తాపూర్, పాలకొండ, మహబూబ్‌నగర్ వరకు రోడ్ల మీద ఉ న్న సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం ఉదయం నిందితులు ఇద్దరు కలిసి జడ్చర్ల బస్టాండ్ వద్ద ఆటోను నిలిపి దొంగలించిన బంగారు వస్తువులను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.