లిఫ్ట్ ఇచ్చి దారి దోపిడీ
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:12 PM
లిఫ్ట్ ఇచ్చి దారి దోపిడీకి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
జడ్చర్ల, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : లిఫ్ట్ ఇచ్చి దారి దోపిడీకి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. సీఐ కమలాకర్ తెలిపిన వివ రాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మిట్ట శివశంకర్ ఈ నెల 6న దారిదోపిడీకి పాల్ప డ్డాడు. జడ్చర్ల మునిసిపాలిటీలోని కావేరమ్మపేటకు చెందిన దండు లక్ష్మ మ్మ, భూత్పూర్ మండలం తాడిపర్తి గ్రామంలో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రోడ్డుపై ఉన్న లక్ష్మమ్మకు లిఫ్ట్ ఇ స్తానని శివశంకర్ బైక్‌పై ఎక్కించుకున్నాడు. జడ్చర్ల మండలం మల్లె బోయిన్‌పల్లి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె వద్ద ఉన్న ఐదు గ్రాముల బంగారు, 15తులాల వెండి ఆభరణాలు లాక్కున్నాడు. దీ నిపై జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. జడ్చర్ల పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శివ కుమార్‌ను పట్టుకుని విచారణ చేపట్టగా దారిదోపిడీకి పాల్పడిన విష యం వెల్లడించాడు. అతని నుంచి ద్విచక్రవాహనం, బంగారు, వెండి ఆభ రణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.