Share News

గాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికి ఆదర్శం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:06 PM

మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు.

గాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికి ఆదర్శం
నారాయణపేటలో గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ, బీజేపీ నాయకులు

- ఎంపీ డీకే అరుణ

- ఘనంగా మహాత్ముడి జయంతి

- పూలమాలలతో నివాళి

నారాయణపేట రూరల్‌/నారాయణపేట న్యూటౌన్‌/నారాయణపేట క్రైం/కోస్గి/ గుండుమాల్‌/దామరగిద్ద/మక్తల్‌/నర్వ/ మరికల్‌/కృష్ణ/ఊట్కూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని పేట జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు ప్రపంచానికే ఆదర్శమన్నారు. ప్రతీ ఒక్కరూ గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రతంగ్‌పాండురెడ్డి, పి.శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ శ్వేతసత్యయాదవ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజులరాఘవేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మీశాంసుందర్‌గౌడ్‌, సత్యరఘుపాల్‌, రఘువీర్‌ తదితరులున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో...

పట్టణంలోని సీవీఆర్‌ భవన్‌లో గాంధీ చిత్రపటానికి, విగ్రహానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆచరించిన నియమాలను కొనియాడారు. కార్యక్రమంలో పేట మార్కెట్‌ చైర్మన్‌ సదాశివారెడ్డి, నాయకులు సలీం, సంతోష్‌కుమార్‌, వెంకటేష్‌గౌడ్‌, కౌన్సిలర్లు శ్వేత, బండి రాజేశ్వరి, అరుణ, భాగ్యవతి, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో..

జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి బీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించి గాంధీ త్యాగాలను కొనియాడారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయసాగర్‌, కౌన్సిలర్‌ నారాయణమ్మ, ప్రతాప్‌రెడ్డి, జగదీశ్‌, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులున్నారు.

అదేవిధంగా, తపస్‌, పీఆర్టీయూ, టీఎస్‌యూ టీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రజా సంఘాల నాయకులు గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రిల చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవా రం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మంది రంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలె క్టర్‌ శ్రీను గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీడబ్ల్యూవో రాజేందర్‌గౌడ్‌, కలెక్టరేట్‌ ఏఓ అనిల్‌కుమార్‌, ఆయా శాఖల అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ చిత్రప టానికి ఎస్పీ డాక్టర్‌ వినీత్‌, పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, మద్యపానం లేని సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. అలాగే లాల్‌ బహదూర్‌ శాస్ర్తి జయంతిని నిర్వహించారు. డీఎస్పీలు మ హేష్‌, లింగయ్య, సీఐలు శివశంకర్‌, భగవంత్‌ రెడ్డి, ఆర్‌ఐ విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

కోస్గి పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం తో పాటు, గుండుమాల్‌, దామరగిద్ద మండలా ల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి ఆయన సేవలను కొనియాడారు. ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.

మక్తల్‌ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఆవ రణలో తపస్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడారు. అలాగే ఆర్యవైశ్య సంఘం, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, లయన్స్‌క్లబ్‌, జనసేన పార్టీల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

నర్వలో గాంధీ విగ్రహానికి సర్పంచు హ న్మంతురెడ్డి, ఉప సర్పంచు అజయ్‌, వార్డు సభ్యు లు, మరికల్‌లో గాంధీ విగ్రహానికి సీఐ భగవం త్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యమోహన్‌రెడ్డి, సర్పంచ్‌ చెన్నయ్య, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్‌, బీజేపీ, వాణిజ్య సంఘం, అఖిలపక్ష నాయకులు కృష్ణ తహసీల్దార్‌ కార్యాలయంలో గాంధీ చి త్రపటానికి తహసీల్దార్‌ శ్రీనివాస్‌, హిందూపూర్‌ లో గాంధీ విగ్రహానికి సర్పంచు అశ్వినిమహేశ్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఊట్కూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మహాత్ముని చిత్రపటానికి సర్పంచ్‌ రేణుకభరత్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలు వురు నాయకులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో సర్పంచులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:06 PM