గాంధీజీ అహింసా మార్గం అనుసరణీయం
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:23 PM
గాంధీజీ అహింసా మార్గం అందరికీ అనుసరణీయమని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): గాంధీజీ అహింసా మార్గం అందరికీ అనుసరణీయమని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక గాంధీచౌక్‌లో దివంగత బాపూజీ విగ్రహానికి, అనంతరం ఐడీవోసీ ఆవరణలో చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలతో దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాడానికి ప్రజలందరినీ ఏకం చేశారని, ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు. కార్యక్రమం లో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఎమ్మెల్యే, ప్రముఖుల నివాళి
గద్వాల టౌన్, (ఆంధ్రజ్యోతి): సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మా ర్గంలో పోరాటం సాగించిన గాంధీజీ ఆదర్శనీయుడని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని చింతలపేటలో దివంగత బాపూజీ విగ్రహానికి మునిసిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, నాయ కులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, తుమ్మల నరసింహులు, రామన్‌గౌడ, గోవిందు, బంగి సుదర్శన్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.