దీర్ఘకాలిక సెలవులో గద్వాల ఆర్డీఓ
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:10 PM
గద్వాల ఆర్డీఓ అలివేలు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.
ఫైళ్ల క్లియరెన్స్‌లో నిర్లక్ష్యం చేశారని ఆరోపణ
హౌసింగ్ పీడీకి ఇన్‌చార్జి బాధ్యతలు
గద్వాల, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): గద్వాల ఆర్డీఓ అలివేలు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. గత సర్పంచు ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు గద్వాల ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె వచ్చినప్పటి నుంచి ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం తగ్గి పెండింగ్ ఫైళ్లుగా మారుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు, రైతులు కా ర్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రోజు రో జుకూ పెండింగ్ ఫైళ్లు ఎక్కువ అయ్యాయి. మిస్సింగ్ సర్వేనెంబర్లు, డీఎస్ పెండింగ్, సక్సేషన్స్, ఓఆర్‌సీలు వంటివి పెండింగ్ పడిపోయాయి. దాదాపు ఇప్పటికే కొన్ని వంద ఫైళ్ల క్లి యరెన్స్ కాకుండా నిలిచిపోయాయని తెలుస్తున్నది. దీంతో చాలామంది రైతులు, దరఖాస్తుదారులు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు లు చేశారు. రాజకీయ నాయకుల చేత వత్తిడులు తెచ్చారు. వీటిని గమనించిన కలెక్టర్ బీఎం సంతోష్ వారంక్రితం ఆర్డీఓ కార్యాలయా న్ని తనిఖీ చేసి పెండింగ్ ఫైళ్లపై ఆరా తీశారు. ఎందుకు క్లియర్ కావడం లేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో క్లియర్ కావాలని ఆదేశించి సిబ్బంది పనితీరుపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసి, పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ఒత్తిడికి గురైన ఆర్డీఓ అలివేలు బీపీ పెరిగి ఆసుపత్రికి వెళ్లారు. ఒత్తిడిని తగ్గించుకోవాలని డాక్టర్లు సూచించడంతో దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. కాగా ఆర్డీఓ ఆలివేలు దీర్ఘకాలిక సెలవు పెట్టడంపై మరోరకమైన చర్చ నడుస్తుంది. కొన్ని భూములకు సంబంధించిన రికార్డులు సరిగ్గాలేకపోయిన వాటిని క్లియర్ చేయాలని ఒత్తిడులు చే శారని తెలుస్తుంది. అందుకే ఆమె వాటిని ప ట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫి ర్యాదు చేశారని తెలుస్తున్నది. ఇక్కడ పనిచేస్తే రిమార్కులు వస్తాయని భావించిన ఆర్డీఓ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావుకు ఇన్‌చా ర్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన నిబద్ధత కలిగిన అధికారి అని, రికార్డులు సరిగ్గా ఉంటే నే క్లియర్ చేస్తారు.. లేదంటే పెండింగ్ పెడతా రనే పేరు ఉంది. మరి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు మోక్షం లభిస్తుందా..? ఆయనపై కూ డా ఒత్తిళ్లు వస్తాయా అనేది వేచి చూడాలి.