ముడా నిధులతో మరింత అభివృద్ధి
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:14 PM
రూ.4 కోట్ల ముడా నిధులతో జడ్చర్ల మునిసి పాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.
జడ్చర్ల/మిడ్జిల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : రూ.4 కోట్ల ముడా నిధులతో జడ్చర్ల మునిసి పాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో రూ.1.75 కోట్లతో నిర్మించే షెడ్ నిర్మాణం పనులకు, మునిసిపాలిటీ పరిధిలోని మణికొండ రామయ్యగౌడ్ కాలనీలోని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం నిర్మాణాలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప దేళ్లలో బాదేపల్లి మార్కెట్‌లో ఒక్క షెడ్‌ను మాజీ ఎమ్మెల్యే హయాంలో నిర్మించలేదని ఆరోపించారు. అంతకుముందు మిడ్జిల్ మండలం లిం బ్యాతండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం వెలుగొమ్ముల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, బాలస్వామి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతి, వైస్‌చైర్మన్ రాజేందర్‌గౌడ్, జడ్చర్ల మునిసిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, బాదేపల్లి పీఏసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, బాదిమి శివకుమార్, లక్ష్మయ్య, శంకర్‌బాబు, నయీమొద్దీన్, వేణుగోపాల్, మనోహర్, పాండయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, సర్పంచ్ మన్నిశంకర్, నాయకులు గౌస్, సాయిలు, నాగరాజుగౌడ్, శ్రీనునాయక్, మల్లేష్, మల్లికార్జున్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ధర్మనా యక్, చంద్రునాయక్, విజయాజీ పాల్గొన్నారు.