Share News

డిజిటల్‌ బోధనా పద్ధతి పూర్తిస్థాయిలో అమలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:50 PM

బిల్డింగ్‌ కెపాసిటీ శిక్షణలో నేర్చుకున్న డిజిటల్‌ బోధన పద్ధతులను మెరుగుపర్చుకుని సాంకేతి కపరమైన వనరుల వినియోగంతో తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని జోగుళాంబ గద్వాల డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు.

డిజిటల్‌ బోధనా పద్ధతి పూర్తిస్థాయిలో అమలు
బిల్డింగ్‌ కెపాసిటీ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఈవో విజయలక్ష్మి

  • జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి

గద్వాల సర్కిల్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): బిల్డింగ్‌ కెపాసిటీ శిక్షణలో నేర్చుకున్న డిజిటల్‌ బోధన పద్ధతులను మెరుగుపర్చుకుని సాంకేతి కపరమైన వనరుల వినియోగంతో తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని జోగుళాంబ గద్వాల డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు. గద్వాల మండలం గోనుపాడులో మంగళవారం ‘ఏ బుక్‌ ఆన్‌ డిజిట ల్‌ లర్నింగ్‌‘ అనే అంశంపై గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గ భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు ని ర్వహించిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయులనుద్ధేశించి మాట్లాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు స రికొత్త బోధనా పద్ధతులను సమర్థవంతంగా అ వగతం చేసుకోవాలని సూచించారు. డిజిటల్‌ టె క్నాలజీ వనరుల వాడకం వల్ల విద్యార్థుల్లో ఆస క్తి పెంపొంది అభ్యసనా సామర్థ్యాలు బలపడుతాయని అభిప్రాయపడ్డారు. కోడింగ్‌, డేటా సై న్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజైన్‌ థింకింగ్‌ తదితర అంశాలపై పట్టుసాధించి ముందుకెళ్లాలని పేర్కొన్నారు. భౌతికశాస్త్ర బోధనలో డిజిట ల్‌ సాంకేతికతను వినియోగించడం వల్ల ఉపా ధ్యాయులు సైతం నూతన సాంకేతికపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునే వీలేర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కోర్స్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌, డిస్ర్టిక్ట్‌ రిసోర్స్‌ పర్సన్స్‌లు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:50 PM