Share News

సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:45 PM

డిజిటల్‌ వృత్యంతర శిక్షణలో నేర్చుకున్న అంశా లతో ఉపాధ్యాయులు సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా బోధన చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ పేర్కొన్నారు.

సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన
ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

  • ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల సర్కిల్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ వృత్యంతర శిక్షణలో నేర్చుకున్న అంశా లతో ఉపాధ్యాయులు సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా బోధన చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ పేర్కొన్నారు. గద్వాల మండలం గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 1న ‘ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ లర్నింగ్‌’ అనే అంశంపై ప్రారంభమైన గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గ గణితం, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ బుధవారం ముగిసింది. చివరిరోజు గణితశాస్త్ర ఉపాధ్యా యులకు ’స్టెమ్‌ ఎక్సలెన్స్‌- మ్యాథమెటిక్స్‌, ఖాన్‌ అకాడమి ఆధారిత డిజిటల్‌ లర్నింగ్‌‘ అనే అం శంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. ఖాన్‌ అకాడమి, ఫిజిక్స్‌ వాలా ఆన్‌ లైన్‌ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. గణితం, సైన్స్‌ సబ్జెక్టులకు ఎంతో ప్రాధాన్యం ఉన్నందున డిజిటల్‌ వనరులను అందిపుచ్చుకుని విద్యార్థులకు సులువుగా అర్ధమయ్యేలా బోధించాలని చెప్పా రు. వారి సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేం దుకై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తరహా సాంకేతికతను సైతం వినియోగించాలని పేర్కొన్నారు. ఖాన్‌ అకాడమీ, ఫిజిక్స్‌ వాలా ఆన్‌లైన్‌ తరగతులతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏఎక్స్‌ తరగతులను స ద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులందరూ ప్రతిభ చాటేలా బోధన చేసి వందశాతం ఫలితాల సాధనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిల్డింగ్‌ కెపాసిటీలో శిక్షణ పొందిన అంశాలను తరగతి గదుల్లో అమలు చేసి విద్యార్థుల అభ్యసనా సా మర్థ్యాల పెంపుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి, కోర్స్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌, డీఆర్పీలు వెంకటేశ్‌, లక్ష్మన్‌, యాదయ్య, రత్నమాల, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:45 PM