అభివృద్ధికి పూర్తి సహకారం
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:30 PM
నారాయణపేట మునిసిపాలి టీ పరిధిలోని 8వ వార్డు సత్యసాయి కాలనీలో ఆదివారం సీసీరోడ్లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు.
- ఎంపీ డీకే అరుణ
నారాయణపేట రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట మునిసిపాలి టీ పరిధిలోని 8వ వార్డు సత్యసాయి కాలనీలో ఆదివారం సీసీరోడ్లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధికిపూర్తి స హకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో రతంగ్‌పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్ మంజుల, కిరణ్‌కుమార్‌రెడ్డి, కృష్ణ, గోపాల్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని అంత్వార్ స్టేజీ సమీపంలో గల ఆత్మబోధ ఆశ్రమం వద్ద హైమాస్ట్‌లైట్లను ఎంపీ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమణిక, కృష్ణ, పుష్పలత, ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మన్ కీ బాత్ వీక్షించిన ఎంపీ
ధన్వాడ: మండల కేంద్రంలో ప్రధాన మంత్రి మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్ర మాన్ని ఆదివారం ఎంపీ డీకే అరుణ ఆధ్వ ర్యంలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై మండల కేంద్రంలో వీక్షించారు. సర్పంచు జ్యోతి, జట్రం గోవర్ద న్‌గౌడ్, శివరాజ్, కురుమూర్తియాదవ్ తదిత రులు పాల్గొన్నారు.