ఘనంగా స్నేహితుల దినోత్సవం
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:51 PM
జిల్లా కేంద్రంలోని బురుడు వాడిలో ఆదివారం చిన్నారులు స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నారాయణపేట, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని బురుడు వాడిలో ఆదివారం చిన్నారులు స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి ఒకరికొనరు తినిపించుకున్నారు.
అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వా మి వివేకానంద పార్కులో స్నేహితుల దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఫ్రెండ్ షిప్ బ్యాండ్‌లను ఒకరికొకరు కట్టు కొని మిఠాయిలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చే శారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రవిగౌడ్, మో హన్, జనార్ధన్, ఆత్మరాం, శ్రీనివాస్, లాహోటి భీమ్‌చందర్‌గౌడ్, సాయినాథ్, బాలాజీ కాంబ్లే, సురేందర్ చారి తదితరులు పాల్గొన్నారు. మక్తల్: పట్టణంలో ఆదివారం వాసవీక్లబ్ ఆ ధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం ఘనంగా ని ర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు ఎం.హరికృష్ణ మా ట్లాడుతూ ఎలాంటి బంధం లేకున్నా పరిచ యంతో ఏర్పడేదే ఫ్రెండ్‌షిప్ అన్నారు. స్నేహం తో ఆత్మీయత పెరుగుతుందన్నారు. కష్టకాలం లో మిత్రులకు తోడుగా ఉండి సహాయ సహ కారాలు అందించాలన్నారు. మన్సాని నాగరాజు, కల్వ శ్రీనివాసులు, పవన్ పాల్గొన్నారు.