Share News

ఫ్రై డే

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:00 PM

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎప్పుడులేని విధంగా అక్టోబ రు నెలలో ఎండలు జిల్లాలో మండిపోతున్నా యి.

ఫ్రై డే
నారాయణపేట పాత బస్టాండ్‌ చౌరస్తాలో శుక్రవారం ఎండలతో తగ్గిన రద్దీ

- మండుతున్న ఎండలు

- పేట జిల్లాలో గరిష్ఠంగా 33 డిగ్రీలు నమోదు

- రాత్రయితే చలిగాలులు

నారాయణపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎప్పుడులేని విధంగా అక్టోబ రు నెలలో ఎండలు జిల్లాలో మండిపోతున్నా యి. వర్షాలు లేక చెరువులు, కుంటలు నిండలే దు. ఆయకట్టు భూములు సాగుకు నోచుకోలేదు. బోర్లలో నీరు తగ్గి భూగర్భజలాలు తగ్గుతున్నా యి. బోర్ల కింద వేసుకున్న వరి పంటలు పలు చోట్ల ఎండిపోయాయి. రోజురోజుకు ఎండలు అధికమవుతుండడంతో ఉక్కపోతతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కరు వు చాయలు నెలకొంటున్నాయి. రాత్రి అయితే చాలు చలిగాలులు వీస్తున్నాయి. నారాయణపేట మునిసిపాలిటీలో ఉష్ర్ణోగ్రతలు శుక్రవారం గరి ష్ఠంగా 33 ఉండగా, కనిష్ఠంగా 23 డిగ్రీలు నమో దు అయ్యింది. గాలిలో తేమ శాతం 48 ఉంది. మక్తల్‌ మునిసిపాలిటీలో గరిష్ఠంగా 33, కనిష్ఠం గా 24 డిగ్రీలు, కోస్గి మునిసిపాలిటీలో గరిష్ఠంగా 31, కనిష్ఠంగా 23, మద్దూర్‌ మునిసిపాలిటీలో గ రిష్ఠంగా 31, కనిష్ఠంగా 23 డిగ్రీలు నమోదు అ యింది.

Updated Date - Oct 30 , 2026 | 11:00 PM